//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

షారుక్ ఖాన్ జీరో ట్రైలర్ రివ్యూ

Category : movies

బాలీవుడ్ బాద్షా , కింగ్ కాంగ్ షారుక్ ఖాన్ చాలా గ్యాప్ తరువాత చేసిన చిత్రం జీరో. షారుక్ ఖాన్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చుసిన వెంటనే ఎక్సపీరియన్స్ మాములుగా లేదు. మనల్ని మనం మర్చిపోయి షారుక్ మాయలో పడిపోతాం. ఒక డిఫరెంట్ అనుభవం ఈ ట్రైలర్ , బాద్షా అభిమానులకయితే pandage. దీంట్లో  షారుక్ కోసం ఎంత ఎక్కువ మాట్లాడుకున్న తక్కువే. Zero Trailer Review

హీరోయిన్లుగా  అనుష్క శర్మ , కత్రినా కైఫ్ నటించగా , తాను వెడ్స్ మను డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాజ్ ఈ చిత్రం తెరకెక్కించారు. మూడు నిముషాల, పదిహేను సెకెన్ల నిడివితో రిలీజ్ అయినా ఈ ట్రైలర్ లో షారుక్ ఖాన్ మరుగుజ్జు వ్యక్తి గా కనిపిస్తున్నాడు. ఒక అందమైన అమ్మాయిని పెళ్ళిచేసుకోవాలని కళలు కనే పాత్రలో షారుక్ దర్శనమిస్తున్నాడు. అనుష్కా శర్మ, ఊపిరి లో నాగార్జున మాదిరి వీల్ చైర్ లో కూర్చుని నటించే విభిన్న పాత్ర చేసింది.ట్రైలర్ అంతా షారుక్ హంగామా మాములుగా లేదు. Zero Trailer Review

రచ్చ రచ్చ చేసేస్తున్నాడు. షారుక్ , అనుష్క లతో సరదాగా మొదలైన ట్రైలర్ కత్రినా రాకతో ఎమోషన్ టర్న్ తీసుకుంది. ఒక సినీ తారగా కత్రినా కనిపించింది. షారుక్ ని కత్రినా ఇంటి నుండి బైటికి వెళ్లగొట్టె షాట్ కళ్ళలో నీళ్లు రేప్పిస్తునాయ్. షారుక్ అసలు అనుష్క ని పెళ్లిచేసుకుంటాడా , లేదా కత్రినాను పెళ్లిచేసుకుంటాడా అనే ఎమోషన్ డ్రామాగా  సినిమా ఉండబోతుంది అని  ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ట్రైలర్ మొత్తం రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఘనం గా కనువిందు చేసాయి. బాలీవుడ్ బాడీ గార్డ్ సల్మాన్ ఖాన్ ఈ సినిమా లో గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వనున్నాడు.రెడ్ చిల్లి ఎంటర్టైన్మెంట్స్ పై గౌరి ఖాన్ నిర్మించిన ఈ చిత్రం 20  గంటల్లో 30 మిలియన్ వ్యూస్ సాధించి యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. డిసెంబర్ 21 ని క్రిస్మస్ ని పురస్కరించుకుని థియేటర్ లోకి రానుంది.Zero Trailer Review