షావోమి రేపటి నుంచి రిపబ్లిక్ డే సేల్కు తెరలేపేందుకు సిద్ధమవుతోంది. ఎంఐ.కామ్‌లో ఈ సేల్ నిర్వహించబోతుంది. ఈ సేల్‌లో భాగంగా మొబైల్ ఫోన్లు, ఆడియో యాక్ససరీస్, పవర్ బ్యాంక్స్, హోమ్ గాడ్జెట్స్, ఇతర ఉత్పత్తులపై షావోమి ప్రకటించింది.
రేపు అర్థరాత్రి నుంచి ప్రారంభమయ్యే ఈ సేల్, రిపబ్లిక్ డే వరకు కొనసాగనుంది. ఈ సేల్ పిరియడ్‌లో ప్రతిరోజు ఉదయం 10 గంటలకు డిస్కౌంట్ కూపన్లను కంపెనీ అందించనుంది. రూ.50, రూ.100, రూ.200, రూ.500 డినామినేషన్లలో ఈ డిస్కౌంట్ కూపన్లు అందుబాటులో ఉండనున్నాయి. అదనంగా మొబిక్విక్ ద్వారా జరిపిన పేమెంట్లకు ఫ్లాట్ 30 శాతం సూపర్ క్యాష్‌ను అందించనుంది.
మూడు నెలల హంగామా ప్లే సబ్‌స్క్రిప్షన్‌ను, 12 నెలలు హంగామా మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ ఈ సేల్‌లో కొనుగోలుదారులకు లభించనుంది. వీటితో పాటు 14,999 రూపాయలుగా ఉన్న ఎంఐ ఏ1 స్మార్ట్‌ఫోన్ 13,999 రూపాయలకే లభ్యం కానుంది. ఎంఐ మిక్స్2 ధర 35,999 రూపాయల నుంచి 32,999 రూపాయలకు తగ్గించింది. ఎంఐ మ్యాక్స్2 ధరను కూడా వెయ్యి రూపాయల మేర తగ్గించింది.
అదేవిధంగా ఈ సేల్‌లో కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన స్మార్ట్‌ఫోన్ రెడ్మి 5ఏ కూడా రూ.4999 నుంచి విక్రయానికి రానుంది. రెడ్మి వై1 ప్రారంభ ధర 8,999 రూపాయలు కాగ, రెడ్మి వై1 లైట్ 6,999 రూపాయల నుంచి అందుబాటులో ఉండనుంది.20000 ఎంఏహెచ్ ఎంఐ పవర్ బ్యాంకు 2ఐ రూ.1499కు, 10000 ఎంఏహెచ్ ఎంఐ పవర్ బ్యాంకు 2ఐ రూ.799కు, ఎంఐ బ్యాండ్-హెచ్ఆర్ఎక్స్ ఎడిషన్ రూ.1299కు షావోమి అందుబాటులో ఉంచనుంది. పలు స్మార్ట్‌ఫోన్ కేసులు, కవర్లపై 200 రూపాయల వరకు డిస్కౌంట్‌ను అందించనున్నట్టు ప్రకటించింది.