Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాంచన - 3 నటికి లైంగిక వేధింపులు....

Category : movies

లారెన్స్ నటిస్తూ, దర్శకత్వం వహించిన కాంచన - 3 సినిమా సక్సెస్ ఫుల్ టాక్‌ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 90 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే తాజాగా ఓ ఘటన ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్‌లో కాళీ పాత్రకు జోడీగా నటించిన రోసీ పాత్రధారి, రష్యన్ నటి లైంగిక వేధింపులకు గురయ్యారు. చెన్నై పోలీసుల కథనం ప్రకారం...

రష్యాకు చెందిన ఆమె 10 ఏళ్లుగా చైన్నైలోని ఎంఆర్సీ నగర్‌లో నివసిస్తున్నారు. ఆమెతో పాటు భర్త, పిల్లలు ఉంటున్నారు. మోడల్, నటనను వృత్తిగా చేసుకుని జీవిస్తున్నారు. వృత్తి జీవితంలో భాగంగా పరిచయమైన 26 ఏళ్ల రుపేశ్ కుమార్.. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ...

కొన్ని రోజుల క్రితం ఆమెకు ఫొటో షూట్ నిర్వహించాడు. ఆ ఫొటోలను ఆమెకు వాట్సాప్‌ చేసి.. కోర్కె తీర్చమంటూ లైంగిక వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. అతని బ్లాక్ మెయిలింగ్‌తో విసిగి పోయిన ఆమె.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు.. రూపేశ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.