//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కెమిస్ట్రీ పేపర్ లో సెక్స్ కోర్కెల చిట్టా విప్పిన విద్యార్థి !

Category : health kids

విజయవాడ లో ప్రజాప్రతినిధి ఒకరు బి.కామ్ లో  ఫిజిక్స్  చదివిన్నట్లు బహిరంగంగానే చెప్పుకొచ్చాడు. గుజరాత్ లో 12వ తరగతి విద్యార్థి ఒకరు కెమిస్ట్రీ పరీక్షలో ఆ  సబ్జెక్టు గురించి ఏమీ వ్రాయకుండా తనలో చెలరేగుతున్న సెక్స్ కోర్కెల గురించి వ్రాసే సరికి ఆ పేపర్ దిద్దుతున్న లేడీ టీచర్ అది చూసి షాక్ కు గురయ్యారు. 

త‌నకు హీరోయిన్ల పై ఉన్న వ్యామొహం, తన మరదలిపై ఉన్న కోర్కె, త‌న ఇంట్లోని ప‌నిమ‌నిషి ని చూస్తే క‌లిగే ఉద్వేగం వంటి వాటిని వివరిస్తూ వ్యాసమే వ్రాసేసాడు.  త‌న‌కు ఎప్పుడెప్పుడు కోరిక‌లు క‌లుగుతాయో, ఎవ‌రి మీద క‌లుగుతాయో, క‌లిగిన‌ప్పుడు ఏం చేస్తాడో... వివ‌రంగా పేద్ద వ్యాసంగా వ్రాసాడు. 

ఈ సంఘటన  గుజ‌రాత్ లోని ఆనంద్ జిల్లా బొర్సాద్ లో జరిగింది.  కెమిస్ట్రీ ఎగ్జామ్ లో ఒక్క కెమిస్ట్రీ ఆన్స‌ర్ కూడా వ్రాయకుండా, అన్ని సెక్స్ కోరిక‌ల గురించే వ్రాయడంతో టీచర్ అత‌డికి జీరో మార్కులు వేసి, ఆ పేప‌ర్ ను కోఆర్డినేట‌ర్ కు అప్ప‌గిచారు. 

విష‌యం తెలుసుకున్న గుజ‌రాత్ హైయ్య‌ర్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ బోర్డ్ ఓ సంవ‌త్స‌రం పాటు ప‌రీక్ష‌లు వ్రాయకుండా  అతనిని  డిబార్ చేసింది. కెమిస్ట్రీ లోనే కాకుండా మిగితా అన్ని స‌బ్జెక్స్ లోనూ జీరో మార్కులేసింది బోర్డ్.  ఆ విద్యార్థి మాన‌సిక ప‌రిస్థితి స‌రిగా లేక‌నే ప‌రీక్ష లో అలా వ్రాసాడని  భావించి వెంట‌నే త‌ల్లిదండ్రులను పిలిచి మార్క్ షీట్ చూపించి,  విద్యార్థికి కౌన్సెలింగ్ ఇప్పించాల‌ని పేరెంట్స్ కు చెప్పనున్న‌ట్లు బోర్డ్ తెలిపింది.