Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నిరూపిస్తే సెటిల్ చేస్తా: కేశినేని నాని

Category : politics state

విజయవాడ: కేశినేని ట్రావెల్స్ వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలను ఎంపీ కేశినేని నాని ఖండించారు. ట్రావెల్స్‌లో పనిచేసిన ఎవరికీ బకాయి పడలేదని స్పష్టం చేశారు. గుంటూరు లేబర్ కోర్టులో 14 మంది మాత్రమే కేసు పెట్టారని, కోర్టు ఆదేశాల మేరకు నడుచుకునేందుకు సిద్ధంగా ఉన్నానని నాని స్పష్టం చేశారు. నిజంగా బకాయిపడ్డట్లు ఆధారాలు చూపిస్తే..

సెటిల్ చేస్తానని చెప్పారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వందలాది మందికి జీతాలు ఇవ్వలేదని ట్వీట్లు చేస్తున్నవారు.. ఆ వందల మంది కార్మికులు ఎవరో చూపించాలని సవాల్ విసిరారు. ఎవరి ట్వీట్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని నాని స్పష్టం చేశారు.