//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సోనియా, రాహుల్ లకు హై కోర్ట్ షాక్... ఐటి విచారణకు అనుమతి

Category : national politics

కాంగ్రెస్ అధ్య‌క్ష‌, ఉపాధ్య‌క్షులు సోనియా, రాహుల్‌గాంధీల‌కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో  వీరిద్దరూ డైరెక్ట‌ర్లుగా ఉన్న యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై ఆదాయపన్ను శాఖ విచార‌ణ‌కు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. 

అసోసియేట్ జ‌ర్న‌ల్స్ లిమిటెడ్ నుంచి రూ.90 క విలువైన ఆస్తుల‌ను కేవలం రూ.50 ల‌క్ష‌లు చెల్లించి సోనియా, రాహుల్‌గాంధీలు యంగిండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు క‌ట్ట‌బెట్టారంటూ బిజెపి నేత సుబ్రమణియన్ స్వామి ఆరోపిస్తూ దాఖలు చేసిన ప్రైవేట్ క్రిమినల్ ఫిర్యాదుపై కోర్ట్ ఈ ఆదేశం ఇచ్చింది. ఆరోపణలు సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలను కోర్ట్ కు దాఖలు చేసారు. 

ఈ కేసులో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు మోతిలాల్ ఓరా, ఆస్కార్ ఫెర్నాండెజ్‌, సుమ‌న్ దూబెతోపాటు శామ్ పిత్రోడా కూడా నిందితులుగా ఉన్నారు. ఇందులో 2015, డిసెంబ‌ర్‌లోనే సోనియా, రాహుల్‌ల‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గ‌తంలో ప‌టియాలా హౌజ్ కోర్టు కూడా సోనియా, రాహుల్‌ల‌పై ఆదాయపన్ను శాఖను విచార‌ణ‌కు ఆదేశించినా దానిని ఢిల్లీ హైకోర్టులో స‌వాలు చేశారు. కానీ అక్క‌డ కూడా ఈ ఇద్ద‌రు నేత‌ల‌కు ఊర‌ట ల‌భించ‌లేదు.