//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జియో సృష్టించిన పోటీతో ఎయిర్‌టెల్ కు ఎదురుగాలి

Category : business


టెలికం రంగంలో రిలయన్స్‌ జియో సృష్టించిన తీవ్ర పోటీతో దేశీయ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ ఆర్థిక ఫలితాల్లో మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 74.89 శాతం క్షీణించి రూ.367 కోట్లకు పరిమితమైంది. గడిచిన 18 త్రైమాసికాల్లో ఇదే కనిష్ఠ స్థాయి లాభం. డిసెంబర్ 31, 2012తోముగిసిన మూడు నెలల్లో సంస్థ రూ.335 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిన విషయం తెలిసిందే.

ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో కంపెనీ ఆదాయం 14 శాతం క్షీణించి రూ.21,958 కోట్లకు పరిమితమైంది. స్టాక్ మార్కెట్ ముగిసిన తర్వాత సంస్థ ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. దేశీయ టెలికం రంగంలోకి జియో ప్రవేశించిన నాటి నుంచి సంస్థ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నదని, ముఖ్యంగా ధరల విషయంలో ఈ ఒత్తిడి మరింత ఎక్కువగా ఉందని భారతీ ఎయిర్‌టెల్ ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ తెలిపారు.

ఈ నేపథ్యంలో మొత్తం టెలికం ఇండస్ట్రీ ఆదాయం 15 శాతం గండిపడిందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత ఆశాజనకంగా ఉండవచ్చునని ఆయన అంచనావేస్తున్నారు. గతేడాది చివరి త్రైమాసికంలో నమోదైన రూ.373.4 కోట్ల లాభంతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. జూన్ 30 నాటికి కంపెనీ అప్పులు రూ.91,400 కోట్ల స్థాయి నుంచి రూ.87,840 కోట్లకు తగ్గడం విశేషం.

ఇదే సమయంలో నగదు నిల్వలు కూడా రూ.4,666 కోట్ల నుంచి రూ.1,237 కోట్లకు తగ్గాయి. వడ్డీల చెల్లింపులకోసం రూ.1,789 కోట్ల నిధులను వెచ్చించినట్లు విఠల్ తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరినాటికి కంపెనీ వినియోగదారుల సంఖ్య 9.7 శాతం పెరిగి 28 కోట్లకు చేరుకున్నారు. స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ షేరు ధర 1.76 శాతం లాభపడి రూ.427.6 వద్ద స్థిరపడింది.