//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

విరుచుకు పడ్డ సీరియల్‌ కిల్లర్‌ : 2 గంటల్లో ఆరు హత్యలు

Category : national

హరియాణాలో దారుణం చోటు చేసుకుంది. ఏ కారణం లేకుండానే ఓ వ్యక్తి ఆరుగురిని అతి కిరాతకంగా హతమార్చాడు. మంగళవారం ఉదయం ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది.

పల్వాల్‌లో ఈ ఉదయం వరుస హత్యలు చోటు చేసుకున్నాయి. రాడ్‌తో సంచరించిన ఆ యువకుడు విచ్చలవిడిగా పలువురి పై దాడి చేశాడు. ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. చివరకు ఆదర్శ్‌ కాలనీలో గాయాలతో ఉన్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మతిస్థిమితం లేకపోవటంతోనే అతను ఈ పని చేసినట్లు అనుమానిస్తున్నారు. అతని పేరును ఆదర్శ్‌గా పోలీసులు వెల్లడించారు. మృత దేహాలను పోస్ట్‌మార్టంకు పంపిన పోలీసులు.. ఓ మహిళతోపాటు, ముగ్గురు వాచ్‌మెన్లు మృతుల్లో ఉన్నట్లు వెల్లడించారు. ఆ ప్రాంతంలో హై అలెర్ట్‌ విధించిన పోలీసులు.. నిందితుడిని ఫరిదాబాద్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సీరియల్‌ కిల్లర్‌ నిజంగానే మతిస్థిమితం లేని వ్యక్తేనా? తదితర వివరాలను వైద్య నివేదిక అందాక వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.