//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పొరపాటు చేశా అంటున్న'సెరెనా'.

Category : sports

ఇటీవల తాను 20 వారాల గర్భవతినని తన అభిమానులకు స్నాప్‌చాట్‌ ద్వారా తెలియపరిచిన అమెరికా టెన్నిస్ స్టార్ తాను గర్భవతినన్న విషయంపొరపాటుగా చెప్పేశానంటోంది సెరెనా విలియమ్స్‌.వాన్‌కూవెర్‌లో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

'తాను గర్భవతినన్న విషయంపొరపాటుగా చెప్పేశానంటోంది.నేనెప్పుడూ స్టేటస్‌లు, ఫొటోలు చూసుకుంటూ ఉంటా. వాటిని నా జ్ఞాపకార్థాలుగా పోస్ట్‌ చేస్తుంటా. ఎవరికీ తెలియనివ్వకుండా జాగ్రత్తపడుతుండేదాన్ని. కానీ ఈసారి మాత్రం మిస్సయ్యా. ఇలాంటి విషయాలు ఒక్కసారి బయటికి వచ్చాయంటే ఇక ఏవేవో కథలు అల్లేస్తుంటారు. కాబట్టి ఇక చేసేదేంలేక ప్రెగ్నెన్సీ గురించి చెప్పేయాల్సివచ్చింది. ఆస్ట్రేలియా ఓపెన్‌ టోర్నమెంట్‌ ఆడుతున్నప్పుడు నేను గర్భవతిని అన్న విషయం ఆలోచించలేదు. ఆ టోర్నమెంట్‌ గెలవాలన్న ఆలోచన ఒక్కటే ఉండేది. నేను ఆడుతున్న ప్రతీసారీ గెలవాలనుకుంటాను. ఒకవేళ గెలవకపోతే అదే నాకు అతిపెద్ద బ్రేకింగ్‌ న్యూస్‌ అవుతుంది. ఈ అమ్మతనం అనేది జీవితంలో ఓ భాగమే. నాకు బేబీ పుట్టాక కూడా ఆడతాను. నా బేబీ స్టాండ్‌లో నిలబడి నా ప్రదర్శనను చూస్తూ చప్పట్లు కొట్టాలి’ అంటూ చెప్పుకొంచింది సెరెనా.అసలు ఇది అంత ఎందుకు చెప్పింది అంటే పురుషుల టెన్నిస్ మాజీ నంబర్ వన్ ప్లేయర్ ఇలీ నస్టాసే తనపై చేసిన వర్ణ వివక్ష వ్యాఖ్యలకు బాధపడ్డ సెరెనా ఇలా మాటలాడి ఉంటుంది అంటూ ఐటీఎఫ్ వర్గాలు చెపుతున్నాయి.