కూతురు జన్మించిన 11 వారాల తర్వాత ప్రియుడు అలెక్సిస్ ఒహానియన్ను టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ పెళ్లాడబోతోంది. వీరి జంట గురువారం ఒక్కటి కాబోతున్నారు. వీలైనంత గోప్యంగా వివాహం జరుపుకునేందుకు సెరెనా, అలెక్సిస్లు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు తమ వివాహం న్యూ ఓర్లిన్స్ లో జరగనుందన్న విషయాన్ని మాత్రమే వారు బయటకు చెప్పారు. వివాహం జరిగే వేదిక, సమయం గురించి ఇంకా తెలియరాలేదు. వీరి వివాహానికి బియోన్సే, జే జీ, క్రిస్ జెన్నర్ వంటి పాప్ సింగర్లతో పాటు ప్రిన్స్ హ్యారీ, మెగాన్ మార్కల్ వంటి ప్రముఖులు కూడా హాజరుకానున్నట్లు సమాచారం.