//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సాక్ష్యం విడుదలకి .....సెన్సార్ సభ్యుల అభ్యంతరం......!

Category : movies

టాలీవుడ్ లో మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు 'సాక్ష్యం' రానుంది. దర్శకుడు శ్రీవాస్ గత చిత్రాలు కూడా మాస్ ఆడియన్స్ ను మెప్పించినవే.

ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన 'సాక్ష్యం' చిత్రం ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకి రావలసి వుంది. అయితే తాజాగా ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి అధికారులు నిరాకరించినట్టుగా సమాచారం.

పంచభూతాల సాక్షిగా' అనే మాటను బేస్ చేసుకునే ఈ సినిమా కథ కొనసాగుతుంది. అందువలన ఈ సినిమాలో కొన్ని పక్షులను .. జంతువులను కూడా వాడారట. అయితే అందుకు సంబంధించిన అనుమతులను మాత్రం పొందలేదు.

దీనితో సెన్సార్ చేయడానికి అధికారులు నిరాకరించినట్టుగా తెలుస్తోంది. జంతు సంరక్షణ చట్టాలు కఠినంగా వున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్ ఓసీలు తీసుకురావడం కూడా అంత తేలిక కాదు. ఈ విషయం విడుదల తేదీపై ప్రభావం చూపుతుందేమోననే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.