//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోడీ వార్షికోత్సవం రోజున స్టాక్ మార్కెట్ లో సెన్సెక్స్ సంచలనం

Category : business national

నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి సంస్కరణలు ఊపందుకోవడంతో స్టాక్ మార్కెట్ లో సెన్సెక్స్ గంతులు వేస్తూనే ఉన్నది. ప్రభుత్వం తృతీయ వార్షికోత్సవం జరుపుకున్న శుక్రవారం రోజున దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో సెన్సెక్స్ తొలిసారిగా 31,000 మైలురాయికి, నిఫ్టీ 9,600 స్థాయికి చేరుకొని సరికొత్త రికార్డు లను నెలకొల్పాయి. 

 మార్కెట్లు సరికొత్త జీవనకాల గరిష్ఠాలను తాకడం వరుసగా ఇది రెండో రోజు. మోదీ ప్రభుత్వం మున్ముందు మరిన్ని సంస్కరణలు చేపట్టవచ్చన్న అంచనాలు, ఈసారి వర్షపాతం సానుకూలంగా ఉండవచ్చన్న ఆశలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరోమారు వడ్డీరేట్ల పెంపు ఇప్పట్లో ఉండకపోవచ్చన్న సంకేతాలు మార్కెట్లో కొనుగోళ్ల ఉత్సాహాన్ని పెంచాయి.

వారాంతం సెషన్‌లో ప్రధాన షేర్లతోపాటు చిన్న, మధ్య స్థాయి షేర్లలోనూ కొనుగోళ్లు భారీగా పుంజుకున్నాయి. మే 26, 2014న మోదీ నేతృత్వంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు స్టాక్ మార్కెట్ వర్గాల సంపద రూ.50 లక్షల కోట్లు పెరిగింది. 

అప్పట్లో రూ.75 లక్షల కోట్లుగా ఉన్న బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీలన్నింటి మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రస్తుతం రూ.125 లక్షల కోట్ల స్థాయికి చేరుకుంది. గడిచిన మూడేండ్ల కాలంలో సెన్సెక్స్ 25.53 శాతం (6,311.33 పాయింట్లు) పుంజుకుంది. నిఫ్టీ 30.38 శాతం ఎగబాకింది.