//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సంచలనం... దర్శకుడి మోసం

Category : national movies

కర్ణాటక సిని పరిశ్రమలో ఒక్కసారిగా కలకలం రేగింది. కర్ణాటకలోని బెళగావిలోని సంగొళ్ళిరాయణ్ణ సొసైటీ ద్వారా కోట్లాదిరూపాయల మోసానికి పాల్పడ్డారని ఖాతాదారులు దర్శకులు ఆనంద్‌ అప్పగోళ నివాసాన్ని ముట్టడించారు. సదరు సొసైటీకి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించిన ఆనంద్‌ జైలుకు వెళ్ళి బెయిల్‌పై విడుదలయ్యారు.

దీంతో పెద్దఎత్తున ఖాతాదారులు బెళగావి హనుమంతనగర్‌లోని ఆనంద అప్పగోడ నివాసాన్ని ముట్టడించారు. జాతీయ బ్యాంకుల కంటే ఎక్కువ శాతం వడ్డీ ఇస్తామని ప్రజల్ని నమ్మించి డిపాజిట్లు సేకరించారు. గడువు ముగిసినా వా పసు ఇవ్వకపోవడంతో ఆయనపై కేసు నమోదు కాగా జైలుకెళ్ళి బెయిల్‌పై వచ్చారు. దీనిపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు