//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తెలంగాణ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం : టీఆర్ఎస్‌కు హ‌రీశ్‌రావు గుడ్‌బై..!

Category : politics state

కేటీఆర్ రాజ‌కీయంగా క్రియాశీలం అయిన‌ప్ప‌టి నుంచి ప్రస్తుతం ఆప‌ద్ధ‌ర్మ మంత్రిగా ఉన్న హ‌రీశ్‌రావుపై ర‌క ర‌కాల వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఒక‌ప్పుడు తెరాస‌లో కేసీఆర్ త‌రువాత హ‌రీశ్‌దే పెత్త‌నం. ఆయ‌న‌కు ఆ పార్టీ ట్రబుల్ షూట‌ర్‌గా కూడా పేరుంది. కానీ, కేటీఆర్ బ‌లం పెర‌గ‌డంతో హ‌రీశ్‌రావు అసంతృప్తిగా ఉన్నాడ‌న్న మాట‌లు త‌ర‌చూ వినిపిస్తున్నాయి.

Sensation In Telangana POlitics :Harishrao Goodbye to trsparty

తాజాగా, కాంగ్రెస్ నేత వంటేరు ప్ర‌తాప్‌రెడ్డి కూడా ఇదే మాట చెబుతున్నారు. హ‌రీశ్‌రావు అసంతృప్తితో ర‌గిలిపోతున్నాడ‌ని న‌వంబ‌ర్ 14న బుధ‌వారం నాడు ఆప‌ద్ధ‌ర్మ మంత్రిగా ఉన్న త‌న్నీరు హ‌రీశ్‌రావు టీఆర్ఎస్‌కు రాజీనామా చేసి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నార‌ని వంటేరు ప్ర‌తాప్ రెడ్డి బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబుతున్నాడు.

Sensation In Telangana POlitics :Harishrao Goodbye to trsparty

టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్ప‌ట్నుంచి హ‌రీశ్‌రావు గురించి ఈ వార్త‌లు వినిపిస్తూ ఉన్న‌ప్ప‌టికీ ఇటీవ‌ల మ‌హాకూట‌మిలో భాగ‌స్వామిగా ఉన్న తెలంగాణ జ‌న స‌మితి అధ్య‌క్షులు కోదండ‌రామ్ రాహుల్ గాంధీని క‌లిసిన సంగ‌తి తెలిసిందే. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగిన వీరిద్ద‌రి భేటీలో కాంగ్రెస్‌లోకి హ‌రీశ్‌రావు చేరిక గురించి చ‌ర్చించాని వంటేరు ప్ర‌తాప్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రాజ‌కీయంగా మంచి గుర్తింపు పొందిన హ‌రీశ్‌రావు కాంగ్రెస్‌లో చేరిక‌కు రాహుల్ గాంధీ గ్రీన్‌ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని కూడా ఆయన వెల్ల‌డించారు.

ఇక వంటేరు ప్ర‌తాప్ రెడ్డి టీఆర్ఎస్‌ను వ‌దిలి కాంగ్రెస్‌లో చేర‌డానికి గ‌ల ప‌లు కార‌ణాల‌ను చెబుతున్నారు. టీఆర్ఎస్‌లో కేటీఆర్ ప్రాధాన్య‌త‌ను హ‌రీశ్ త‌ట్టుకోలేక పోతున్నార‌ని, ఒక‌ప్పుడు త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే నాయ‌కులు కూడా దూర‌మ‌వుతున్నార‌న్న అసంతృప్తితో హ‌రీశ్‌రావు ఆవేద‌న‌లో ఉన్న‌ట్టు వంటేరు ప్ర‌తాప్‌రెడ్డి చెబుతున్నారు.

ఇక టీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో పార్టీలో నామినేటెడ్ ప‌ద‌వుల‌ను కూడా హ‌రీశ్ వ‌ర్గానికి కాకుండా కేటీఆర్‌, క‌విత చెప్పిన వారికే ఇవ్వ‌డంతోపాటు పార్టీ అధినాయ‌క‌త్వం నుంచి నేత‌ల వ‌ర‌కు త‌న‌ను అవ‌మానించిన తీరును దృష్టిలో పెట్టుకున్న హ‌రీశ్‌రావు తీవ్రంగా క‌ల‌త చెంది పార్టీ మారే ఆలోచ‌న చేసిన‌ట్టు వంటేరు ప్ర‌తాప్ రెడ్డి చెబుతున్నారు. మ‌రి ఇందులో నిజా.. నిజాలు ఎంతో అన్న‌ది కాల‌మే నిర్ణ‌యిస్తుంది.

Related News