Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దేశ రాజకీయాల్లో బాబు ఇమేజ్ .... ఏపీ సీఎంవోలో ఇదే హాట్ టాపిక్

Category : politics

దేశ రాజకీయాల్లో చంద్రబాబుకు ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు.బీజేపీ కి వ్యతిరేఖంగా ఏర్పాటు చేస్తున్న ఫ్రంట్ కు బాబు సారధ్యం వహిస్తున్నారంటేనే బాబు ఇమేజ్ అర్ధం చేసుకోవచ్చు. చంద్రబాబుపై ఉన్న నమ్మకంతోనే కూటమి ఏర్పాటు అవుతుంది అంటే అందులో ఆశ్చర్యం లేదు. ఇటీవల చెన్నై, బెంగళూరు పర్యటన తర్వాత రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత కొందరు మంత్రులు చెప్పిన విషయాలు చంద్రబాబుకి ఉన్న ఇమేజ్ గురించి చాలా గొప్పగా చెప్పాయి.

దేశంలో బీజేపీయేతర పక్షాలను ఏకతాటి మీదకు తీసుకొస్తున్నాడు చంద్రబాబు . ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీజేపీ యేతర కూటమి కోసం చాలా కష్టపడుతున్నారు. ఇందులో భాగంగా పలు ప్రాంతీయ పార్టీల నేతలను కలుస్తున్నారు. . ఫరూక్ అబ్ధుల్లా , శరద్‌పవర్, రాహుల్‌గాంధీ వంటి నేతలను కలిసి జాతీయస్థాయిలో సంచనలం సృష్టిం చారు చంద్రబాబు.

ఇదంతా ఒక ఎత్తయితే.. చంద్రబాబు ఇటీవల జరిపిన బెంగుళూరు, చెన్నై పర్యటనలు గురించి వింటే బాబు కు ఇంత ఇమేజ్ ఉందా అని అనిపించక మానదట...ఈ రెండు రాష్ట్రాలకు వెళ్లిన సమయంలో ఏపీ మంత్రులు యనమల రామకృష్ణుడు, కాలువ శ్రీనివాసులు, నక్కా ఆనందబాబు, కళా వెంకట్రావు, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్, సీఎంవో అధికారులు ముఖ్యమంత్రి వెంట ఉన్నారు. అక్కడ చంద్రబాబు కోసం దేవెగౌడ ,కుమార స్వామి, స్టాలిన్ ఎదురు చూసిన విధానం అక్కడకు చేరుకోగానే స్వాగతం చెప్పిన పద్ధతి ఆయన్ను అంతగా గౌరవించటం, ఫుల్ గా అభిమానం చూపించటం చూసి ఆశ్చర్యానికి గురయ్యారట.బెంగళూరులోని ముఖ్యమంత్రి కుమారస్వామి ఇంట,చెన్నైలోని డీఎంకే అధినేత స్టాలిన్ నివాసంలో పలికిన స్వాగతాన్ని ఏపీ సీఎంవో వర్గాలు ఆసక్తిగా చెప్పుకుంటున్నాయి.

ఏపీ సీఎం చంద్రబాబు బెంగుళూరు వెళ్లి అక్కడ ముఖ్యమంత్రి కుమారస్వామిని, మాజీ ప్రధాని దేవెగౌడను ఆ తరవాత చెన్నై వెళ్లి డీఎంకే అధినేత స్టాలిన్‌తో భేటీ అయ్యారు. పద్మనాభ నగర్‌లో ఉన్న దేవెగౌడ ఇంటికి వెళ్ళిన చంద్రబాబు కాన్వాయ్ దేవెగౌడ నివాసానికి చేరుకోవడానికి పది నిముషాల ముందే ముఖ్యమంత్రి కుమారస్వామి తన తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడ నివాసం వెలుపలికి వచ్చి ఎదురుచూశారు. చంద్రబాబు కారు దిగిన వెంటనే ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఆప్యాయంగా లోపలి తీసుకెళ్ళి శాలువా కప్పి స్వాగతించారు. అనంతరం ఏపీ మంత్రులు, అధికారులను చంద్రబాబు కుమారస్వామి, దేవెగౌడలకు పరిచయం చేసిన తరువాత చంద్రబాబు, కుమారస్వామి, దేవెగౌడ.. ఈ ముగ్గురూ గంటసేపు ఏకాంతంగా చర్చలు జరిపారు. తరువాత వారి కుటుంబ సభ్యులకు పరిచయం చేశారు . వారు కూడా చాలా ఇష్టం గా బాబు తో సెల్ఫీలు దిగారంటే చాలా ఆప్యాయంగా చంద్రబాబును చూశారంటే బాబుకు ఇతర రాష్ట్రాల్లో అంత ప్రాధాన్యత ఉందా అని ఆశ్చర్యానికి గురయ్యారట వెంట వెళ్ళిన నాయకులు . అనంతరం దేవెగౌడ తన బంధువులను, కుటుంబ సభ్యులను కూడా చంద్రబాబుకు పరిచయం చేశారు. గతంలో తాను ప్రధాని కావడానికి చంద్రబాబు ఎలా సహకరించారో వారికి వివరించారు. చాలా ఆప్యాయత నిండిన కలయికగా అనిపించిందని మంత్రులు చెప్పుకుంటున్నారు

ఇక చెన్నై లో కూడా అక్కడ డీఎంకే అధినేత స్టాలిన్, కనిమొళి, డీఎంకేలో ఇతర ముఖ్య నేతలు చంద్రబాబుకు ఎదురేగి స్వాగతం పలికారు. గంటసేపు స్టాలిన్‌తో చంద్రబాబు చర్చలు జరిపారు. అనంతరం ఆయన బయటకి వస్తున్నప్పుడు “సార్, ఒక్క నిముషం ఆగండి” అంటూ స్టాలిన్‌ బాబుని ఆపారు. ఆయనకు తన కుటుంబ సభ్యులందరినీ పరిచయం చేశారు. స్టాలిన్‌ కుటుంబ సభ్యులు చంద్రబాబుతో గ్రూప్‌ఫోటో దిగారు. ఇలా చంద్రబాబు ఇమేజ్ పక్క రాష్ట్రాల్లో ఎలా వుందో చూసిన మంత్రులకు నోట మాట రాలేదు. అందరూ ఆనందాశ్చర్యాలకు లోనయ్యారు. ఇంత మంచి నాయకుడి సైన్యంగా ఉండటం అదృష్టం అని భావిస్తున్నారు.

తనను చంద్రబాబు కలిసిన తర్వాత త్వీట్ లలోనూ ఈ నేతలు బాబును కొనియాడారు. ఈ ట్వీట్‌ను చూసిన తెలుగుదేశం వర్గాలు మరింత ఆనందపడ్డాయి. ఈ విషయాలే ఇప్పుడు సీఎంవోలో ఆసక్తికర చర్చకి దారితీస్తున్నాయి. బాబు ఇమేజ్ ఏపీలో ఏం అనుకున్నా దేశ వ్యాప్తంగా మాత్రం బాగానే వుంది.