//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సీనియర్లు జీతాలు తగ్గించుకొని ఐటీ ఉద్యోగులను కాపాడండి

Category : national business

ఐటీ కంపెనీల్లోని సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్స్ త‌మ జీతాల‌ను త‌గ్గించుకొని చిన్న‌స్థాయి ఉద్యోగుల‌ను కాపాడాల‌ని ఇన్ఫోసిస్ కోఫౌండ‌ర్ యన్ ఆర్ నారాయ‌ణ‌మూర్తి సూచించారు. ప్రస్తుతం ఐటీ రంగం ఎదుర్కొంటున్న ఉద్యోగ సంక్షోభంకు ఆయన ఈ ప‌రిష్కారం చూపారు.  అంద‌రికీ కుటుంబాలు ఉంటాయని అంటూ అలాంటి వారిని నిర్దాక్షిణ్యంగా ఇంటికి పంపించేయ‌డం స‌రికాదని మూర్తి హితవు చెప్పారు. 

గ‌తంలోనూ ఇలాంటి స‌మ‌స్య‌ల‌ను ఐటీ ఇండ‌స్ట్రీ ఎదుర్కొన్న‌ద‌ని, దీనికి ప‌రిష్కారం కూడా సులువేన‌ని మూర్తి అన్నారు. ఇన్ఫోసిస్‌లో ఇదే ప‌ద్ధ‌తి అవ‌లంబించి ఉద్యోగుల‌ను తొల‌గించ‌కుండా చేయ‌గ‌లిగామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఈ స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం కోసం ఇండ‌స్ట్రీలోని పెద్ద‌లు ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నార‌ని ఆయ‌న చెప్పారు. 

కంపెనీలో అత్యున్న‌త స్థాయిలో ఉండే డైరెక్ట‌ర్ల జీతాల్లో భారీ కోత‌, ఆ త‌ర్వాత వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉండే వారికి కొంత త‌క్కువ‌.. ఇలా చేస్తూ వెళ్తే ఉద్యోగుల‌ను తొల‌గించాల్సిన అవ‌స‌రం రాద‌ని నారాయ‌ణ మూర్తి అభిప్రాయ‌ప‌డ్డారు. 2001లో ఇలాగే జ‌రిగిన‌పుడు తమ  కంపెనీలోని సీనియ‌ర్ మేనేజ్‌మెంట్‌తో కూర్చొని మాట్లాడామని తెలిపారు. 

మ‌నం కొన్ని త్యాగాల‌ను చేసి యంగ్‌స్ట‌ర్స్ ఉద్యోగాల‌ను కాపాడాల‌ని నిర్ణ‌యించామ‌ని మూర్తి చెప్పారు. ఆ స‌మ‌యంలో మిగ‌తా కంపెనీలు కొత్త ఉద్యోగుల జాయినింగ్‌ను ఆల‌స్యం చేస్తుంటే.. ఇన్ఫోసిస్ లో మాత్రం 1500 మందిని కొత్త‌గా తీసుకున్నామ‌ని తెలిపారు. 

అంతేకాకుండా కొత్త టెక్నాల‌జీల‌పై శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి ఉద్యోగుల్లో ఆత్మ‌విశ్వాసం పెంచాల‌ని, వ‌చ్చే ఏడాదిలోపు వాళ్లు కంపెనీకి ఏదో ఒక‌రకంగా ఉప‌యోగ‌ప‌డేలా తీర్చిదిద్దాల‌ని మూర్తి సూచించారు.