//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోడీ తీరుపై తీవ్ర అసంత్రుప్తిలో సీనియర్ ఎంపీలు

Category : national politics

ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహారశైలి పార్టీ ఎంపీలకు మింగుడుపడటం లేదా..? మేము గెలిస్తేనే ప్రధాని అయ్యారు కదా..మరి మమ్మలని లెక్కచెయ్యకపోవడం ఏంటి..? అనే ప్రశ్న ఇప్పుడు బిజెపిలో కలకలం సృష్టిస్తుంది. అదేమిటో ఒక్కసారి చూద్దాం. గత ఎన్నికల్లో బిజెపి విజయం సాధించింది అంటే దానికి ప్రధాన కారణ౦ నరేంద్ర మోడీ. అప్పటి ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ చేసిన ప్రచారం బిజెపికి లాభించింది. అలాగే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు వచ్చిన ఇమేజ్ కూడా ఇందుకు సహకరించింది.

అయితే ప్రధాని అయిన కొంత కాలం వరకు మోడిలో మరో కోణం కనపడలేదని..ఉత్తరప్రదేశ్ ఎన్నికల నుంచి ఇక తానే ప్రధానిగా ఉంటాను అనే భావనకు ప్రధాని వచ్చారని దీనితో ఇక పార్టీలో తాను తప్పించి మరో దిక్కు లేదనే అభిప్రాయంలోకి ఆయన వెళ్ళిపోయి కనీసం ఎవరిని పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇటీవల త్రిపుర లో జరిగిన ఒక కార్యక్రమంలో అద్వాని నమస్కారం పెడుతున్నా మోడీ మాత్రం చూడకుండా వెళ్ళిపోయారు. ఇది నిజంగా పార్టీ నేతలను చికాకు పెట్టింది.

అద్వానీని రాజకీయ గురువుగా భావించే వారిలో మోడీ కూడా ఒకరు. ఈ రోజు మోడీ అనుభవిస్తున్న పదవి ఆయన భిక్ష అంటూ ఆయన వ్యవహారశైలిని తప్పుబడుతున్నారు. అయితే మోడిపై ఉన్న అసంతృప్తి ప్రభుత్వాన్ని కూల్చే విధంగా కూడా వెళ్ళిందట. అందుకే అవిశ్వాస తీర్మానంలో సీక్రెట్ ఓటింగ్ ఉండటంతో ప్రధాని వెనుకడుగు వేస్తున్నారని అంటున్నారు. ఇదిలా ఉంటె సీనియర్ ఎంపీల అభిప్రాయాలను మోడీ కనీసం గౌరవించకుండా ప్రవర్తిస్తున్నారని..వారిలో చాలా మంది సొంతగా పోటి చేసినా గెలుస్తారని..కాబట్టి మోడీ మారకపోతే ఆయనకే ఇబ్బంది అంటూ అభిప్రాయపడుతున్నారు.