//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాజీనామా

Category : state politics

కాంగ్రెస్‌ పార్టీ ఏటూరునాగారం పట్టణ కమిటీ అధ్యక్షుడు, సీనియర్‌ నాయకుడు సప్పిడి రాము పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈసందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను ఊహతెలిసిన నాటి నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశానని అన్నారు.

పార్టీలో వర్గవిభేదాలు చోటు చేసుకోవడంతో పాటు సీనియర్‌ నాయకులు పార్టీ సిద్ధాంతాలను మైమరచి కార్యకర్తలపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. అధిష్ఠానం విధించిన నిబంధనలను తుంగలో తొక్కి దుర్భాషలాడుతున్నారని, వారు అలాంటి ప్రవర్తనను మార్చుకోవాలని అన్నారు.