Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీడీపీని వీడే యోచనలో సీనియర్ నేత

Category : politics

తూర్పుగోదావరి జిల్లా: మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు టీడీపీని వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సన్నిహితులతో మంతనాలు జరిపినట్లు సమాచారం. త్వరలో వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలిసింది. జిల్లాలో పార్టీ సీనియర్ నేతగా పేరొందిన ఆయన 1999లో ఆయన టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు.

2004, 2009లో టీడీపీ తరపున పెద్దాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలుపొందిన అనంతరం ఆయన వైసీపీ వీడి టీడీపీలో చేరారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Related News