//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్టీఆర్ బయోపిక్ లో...సీనియర్ నటుడు నరేష్ ఎంట్రీ...

Category : movies

స్వర్గీయ నేత మాజీ ముఖ్య‌మంత్రి, విశ్వ విఖ్యాత నట కిరీటి నంద‌మూరి తార‌క‌రామారావు జీవిత‌క‌థ ఆధారంగా ఎన్టీయార్‌ బ‌యోపిక్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. నంద‌మూరి బాల‌కృష్ణ ఈ సినిమాలో న‌టించ‌డ‌మే కాకుండా తొలిసారి నిర్మాత‌గా కూడా మారారు.

క్రిష్ డైరెక్ష‌న్‌లో ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమా గురించి రోజుకో అప్‌డేట్ బ‌య‌టికొస్తున్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా మ‌రో అప్‌డేట్ బ‌య‌టికొచ్చింది. సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ ఈ సినిమాలో ఓ కీల‌క‌పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఎన్టీయార్ సినిమా కెరీర్‌లో నిర్మాత బీఏ సుబ్బారావుది కీల‌క‌పాత్ర‌. ఎన్టీయార్‌ను పల్లెటూరి పిల్ల‌ సినిమాతో హీరోను చేసింది సుబ్బారావే.

మ‌న‌దేశం, షావుకారు సినిమాల త‌ర్వాత ఎన్టీయార్ న‌టించిన మూడో సినిమా ప‌ల్లెటూరి పిల్ల‌. ఈ సినిమాను నిర్మించిన బీఏ సుబ్బారావు పాత్ర‌లో సీనియ‌ర్ న‌రేష్ క‌నిపించ‌బోతున్నారు. ప్ర‌స్తుతం బాల‌య్య‌, న‌రేష్ కాంబినేష‌న్‌లో సీన్ల షూటింగ్ జ‌రుగుతోంది.