//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తెలంగాణ ఎన్నికలపై కామెంట్ చేసిన హీరోయిన్

Category : politics national

తెలంగాణ ఎన్నికలపై కామెంట్ చేసి సంచలనం సృష్టించింది ప్రముఖ సీనియర్ నటి గౌతమి .గౌతమి తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళనాట అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. పెద్ద హీరోలైన రజనీకాంత్, కమల్ హాసన్, వెంకటేష్ , రాజశేఖర్ లాంటి హీరోల సరసన నటించిన గౌతమి కమల్ హాసన్ తో కొన్నాళ్ల పాటు సహజీవనం చేసింది . కొన్ని విభేదాల కారణంగా కమల్ నుండి విడిపోయింది. మొన్న ఈమధ్య మనమంతా చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలు పొందింది గౌతమి .

ఇక ఎన్నికల విషయానికి వస్తే తెలంగాణ ప్రజలు కెసిఆర్ ని పరిపాలించమని ఐదేళ్లు అవకాశం ఇస్తే , ప్రభుత్యాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం సరైన చర్య కాదని కేసీఆర్ ప్రభుత్వాన్ని తప్పుపట్టింది గౌతమి . 2014 లో ఎన్నికలు జరిగాయి , జూన్ 2 రాష్ట్రావతరణ దినోత్సవం కాబట్టి మళ్లీ ఎన్నికలు మేలోపు జరగాలి కానీ సెప్టెంబర్ లోనే శాసనసభ రద్దు చేసాడు తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ .తెలంగాణలో 9 నెలల ముందుగా శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నందున బోలెడు ప్రజాధనం వృధా అవుతుందని ప్రతిపక్షాలు, ప్రజలు ఆరోపిస్తున్నారు.

senior actor goutami comments on telangana elections

Related News