//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

లైంగిక దాడి కేసులో మరో స్వామీజీ అరెస్టు......!

Category : state

స్వామిజీలమని చెప్పుకుంటూ ఆ ముసుగులో ఎంతో మంది అమాయకమైన ఆడపిల్లల జీవితాలని ఆడుకుంటున్నారు . ఢిల్లీలో లైంగిక దాడి ఆరోపణలపై వివాదాస్పద స్వామీజీ ఆషు మహరాజ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

హజ్‌ఖాస్‌ ఆశ్రమంలో ఒక మహిళ, ఆమె మైనర్‌ కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ఇదే కేసులో ఆయన కుమారుడు సమర్‌ ఖాన్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

2008 నుంచి 2013 వరకూ స్వామీజీ, ఆయన స్నేహితులు, కుమారుడు తనపై, తన మైనర్‌ కుమార్తెపైనా లైంగిక దాడి జరిపారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు ఆరోపించారు. నిందితులపై పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు.

Related News