టీం ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కి భారిగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అతను క్రికెట్ లో ఉన్నన్ని రోజులు ఏ విధంగా అయితే అభిమానులు ఆయనను అభిమానించారో ఇప్పుడు క్రికెట్ నుంచి వైదొలిగినా అదే అభిమానం చూపిస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. పటియాలాకు చెందిన 93 ఏళ్ల ఓం ప్రకాశ్ అనే వ్యక్తి సెహ్వాగ్‌కు వీరాభిమాని. మంగళవారం ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా.
కింగ్స్ లెవెన్ పంజాబ్ కోచ్ వీరూను ఓం ప్రకాశ్ కలుసుకున్నాడు.ఈ సందర్భంగా సెహ్వాగ్.. వయసులో తనకంటే చాలా పెద్దవారైన ఓం ప్రకాశ్ కాళ్లకు మొక్కి పెద్దలపట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నాడు. సాధారణంగా అభిమానులు తమ ఫేవరెట్ తారలకు, ఆటగాళ్లకు దండం పెట్టడాన్ని చూస్తుంటాం... కాని సెహ్వాగ్ ఇలా అభిమాని కాళ్ళను తాకి ఆశీర్వాదం తీసుకోవడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఫోటోలను పంజాబ్ జట్టు అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.