//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పెట్రోల్ ఇక నుంచి పాకెట్స్

Category : national

గత కొంత కాలంగా పెట్రోల్ ధరలు అమాంతం పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారిగా పెరిగిపోయాయి. కాంగ్రెస్ హయాంలో ఉన్న ధరలు తగ్గిస్తామని చెప్పిన మోడీ సర్కార్ పెంచుకుంటూ పోతుంది. దీనితో అన్ని వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తాజాగా దీనిపై వామపక్ష నేత సీతారాం ఏచూరి స్పందించారు. తన ట్విట్టర్ అకౌంట్‌లో చేసిన పోస్ట్ ద్వారా కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఆయన ఎండగట్టారు.

ఆయన షేర్ చేసిన ఒక ఫొటో ఒకటి పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వల్ల భవిష్యత్ ఎలా ఉండబోతోందో వివరించే ప్రయత్నం చేశారు. అయితే ఇది నెటిజెన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇంతకీ అందులో ఏముంటుందంటే.. రూపాయి షాంపూ ప్యాకెట్ల రూపంలో ఉన్న చిత్రాలపై పెట్రోల్ అని, దాని కింద రూ.50 ధర వేసి ఉంటుంది. అంటే.. భవిష్యత్‌లో రూ.50లకు 5ఎంఎల్ పెట్రోల్ మాత్రమే వస్తుందని వ్యంగ్యంగా చెప్పారు. ఈ ఫొటో నెటిజన్లకు తెగ నచ్చడంతో షేర్‌లతో అదరగొడుతున్నారు.