//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ల‌గ‌డ‌పాటి స‌ర్వేల వెన‌కున్న మ‌త‌ల‌బు తెలిస్తే షాక‌వుతారు..!

Category : politics

తెలంగాణ‌తోపాటు ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గబోతున్న వేళ ల‌గ‌డ‌పాటి స‌ర్వే పేరుతో చాలా వార్త‌లు ఇప్ప‌టికే వైర‌ల్ అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఉన్న‌ట్టుండి మీడియా ముందుకొచ్చారు ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌. సోష‌ల్ మీడియాలో త‌న పేరుతో వ‌స్తున్న స‌ర్వేల‌న్నీ ఫేక్ అని కొట్టి పారేశారు. రాజ‌కీయ పార్టీలు కావాలంటే స‌ర్వేలు చేస్తాన‌ని చెప్పుకొచ్చారు. ఉన్న‌ట్టుండి ల‌గ‌డ‌పాటి మీడియా ముందుకు ఎందుకు వ‌చ్చార‌న్న చ‌ర్చ న‌డుస్తుంది. అస‌లు నిజంగానే ఆయ‌న స‌ర్వేలు చేస్తారా..? అన్న చ‌ర్చ తెలంగాణ కాంగ్రెస్‌లో న‌డుస్తుంది. Secrets Behind Lagadapati Survey

నిజంగా స‌ర్వేలు చేయాలంటే ఫీల్డ్‌లో కో ఆర్డినేట‌ర్లు తిర‌గాలి. జ‌నం నాడిబ‌ట్టాలి. ఒక్కో వ్య‌క్తి నుంచి వివ‌రాలు తీసుకోవాలంటే క‌నీసం రూ.200లు ఖ‌ర్చు పెట్టాల్సి ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు వెయ్యి మంది శాంపిల్స్ తీసుకోవాలంటే రూ.2 ల‌క్ష‌ల దాకా ఖ‌ర్చ‌వుతుంద‌న్న‌ది స‌ర్వే సంస్థ‌ల స‌మాచారం. అయితే, ల‌గ‌డ‌పాటి మ‌నుషులు ఎవ‌రూ కూడా ప‌ల్లెల్లో కానీ, ప‌ట్ట‌ణాల్లో కానీ తిరిగిన దాఖ‌లాలు లేవ‌ని కాంగ్రెస్ నేత‌లు చెప్పుకుంటున్నారు. అలాంట‌ప్పుడు స‌ర్వే లెక్క‌లు ల‌గ‌డ‌పాటికి ఎలా వ‌స్తున్నాయ‌ని అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

అస‌లు ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ స‌ర్వేలు చేయ‌ర‌ని, త‌న వాణిజ్య సంస్థ‌ల అనుగుణంగా, ముఖ్య మంత్రుల‌కు అనుకూలంగా స‌ర్వే ఫ‌లితాల‌ను ఇస్తార‌ని కాంగ్రెస్‌లో ప్ర‌చారం జ‌రుగుతుంది. త‌ద్వారా త‌న వ్యాపార ప‌బ్బం గడుకుంటార‌ని కూడా మాట్లాడుకుంటున్నార‌ట కాంగ్రెస్ నేత‌లు. అంతేగాక‌, బ్యాంకుల‌కు 56, 857 కోట్లు బ‌కాయి ప‌డి అటు కేంద్రానికి కోపం రాకుండా ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఆగ్ర‌హం క‌ల‌గ‌కుండా ల‌గ‌డ‌పాటి జాగ్ర‌త్త ప‌డ‌తాడ‌ని ప్ర‌చారం కూడా న‌డుస్తోంది.

అలాంటి గాలి స‌ర్వేలు ఎంత వ‌ర‌కు ఫ‌లితాలిస్తాయ‌న్న అనుమానాల‌ను కూడా వ్య‌క్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేత‌లు. మ‌రో వైపు ల‌గ‌డ‌పాటి స‌ర్వే ఆధారంగా పార్టీ పెట్టి ఫలితాన్ని ప‌రీక్షించుకున్న కిర‌ణ్ కుమార్ రెడ్డి ఈ మ‌ధ్య స‌ర్వేల గురించి మాట్లాడేందుకు ఇష్ట‌ప‌డ‌టం లేదు. సోనియాను ప్ర‌తీ రోజు క‌లుస్తాన‌ని, త‌న స‌ల‌హా తీసుకుంటార‌ని, రాష్ట్ర విభ‌జ‌న కాని ప‌న‌ని గ‌తంలో చెప్పుకున్నారు ల‌గ‌డ‌పాటి. కానీ, విభ‌జ‌న జ‌ర‌గ‌గానే ఒక క‌న్నీటి చుక్క‌ను రాల్చి త‌న అబ‌ద్ధాల‌ను క‌డిగేసుకున్నార‌న్న ఆరోప‌ణ‌లు కూడా ఆయ‌న‌పై చేస్తున్నారు కాంగ్రెస్ నేత‌లు. స‌మైక్యాంధ్ర పేరు మీదో.. మ‌రేదైన ఇష్యూ పేరు మీద‌నో త‌న ఒట్టు తీసి గ‌ట్టుమీద పెట్టి తిరిగి ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నుకోవ‌డం, అజ్ఞాతం వీడి ప్రెస్ కాన్ఫ‌రెన్స్ పెట్ట‌డం తెలుగు ప్ర‌జ‌ల అదృష్ట‌మ‌ని చెబుతున్నారు కాంగ్రెస్ నేత‌లు.

Related News