//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అక్కడ రహస్య సర్వే టెన్షన్ ... టికెట్ రేసులో ఆ ఐదుగురు

Category : politics

ఏపీ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ Chandrababuటికెట్ విషయం లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఎవరికి టికెట్ ఇవ్వాలన్నా వారికి అర్ధ బలం వుంటే సరిపోదు అంగ బలం వున్నా సరిపోదు ప్రజా క్షేత్రంలో నాయకుడిగా బలం వుండాలి. అలాంటి నాయకులకే Chandrababu టికెట్ కేటాయిస్తారనేది పార్టీలో అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఒక సిట్టింగ్ స్థానం కోసం జరుగుతున్న పోటీ విషయంలో కూడా బాబు సర్వే చేయిస్తున్నారు. ఎవరికి విజయావకాశాలు ఉన్నాయో తెలుస్కునే పనిలో ఉన్నారు. ఇంతకీ ఆ స్థానం టీడీపీ ఈ సారి జిల్లా అంతటా చక్రం తిప్పాలని చూస్తున్న కర్నూలు .

అయితే అక్కడ YSR Congress పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరిన భూమా ఫ్యామిలీలో, ఎస్వీ మోహ‌న్ రెడ్డి టికెట్ విషయంలోనే మీమాంసనెలకొంది … అయితే ఇక్క‌డ గెలుపు గుర్రాలు చాలా ఉన్నాయి.. నంద్యాల ఎమ్మెల్యేగా బ్ర‌హ్మ‌నంద‌రెడ్డి మ‌రోసారి గెల‌వ‌డం త‌థ్యం, ఆళ్ల‌గడ్డ‌లో మంత్రి మ‌హిళా నేత అఖిల‌మ్మ మ‌రోసారి గెల‌వ‌డం త‌థ్యం.అయితే క‌ర్నూలు ఎమ్మెల్యేగా ఉన్న ఎస్వీ మోహ‌న్ రెడ్డికి కాకుండా ఈసారి త‌న‌కు టికెట్ కావాలి అని కోరుతున్న వారు చాలా మందే వున్నారు.

పారిశ్రామిక వేత్త ఆర్దికంగా అండదండ‌లు ఉన్న నేత కావ‌డంతో టీజీ భ‌ర‌త్ టికెట్ ఆశిస్తున్నారు. Chandrababu కూడ ఆయ‌న అభ్య‌ర్దిత్వం ఫైన‌ల్ చేస్తారు అని జిల్లా నేత‌లు భావించారు.. ఎస్వీ వ‌ర్సెస్ టీజీ అనే వ‌ర్గ‌పోరు రాకూడ‌దు అని చూస్తున్నారు, ఇటు మ‌రో ప‌క్క స‌జ్జ‌ల శ్రీధ‌ర్, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అల్లుడు కూడా బ‌రిలో ఉన్నారు. మరోపక్క వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటే ఇక్క‌డ నుంచి కోట్ల ఫ్యామిలీ కూడా రంగంలోకి రానుంది. అలాగే బుట్టా రేణుక‌ పేరు కూడా బాగానే వినిపిస్తోంది..

అయితే YCP త‌ర‌పున ఒక నేత పేరు వినిపిస్తుంటే ఇటు తెలుగుదేశం పార్టీ త‌ర‌పున ఐదుగురి పేర్లు కాంపిటీషన్ లో ఉన్నాయి. మరి సర్వేలతో టికెట్లు కేటాయించే బాబు ఎవరికి టికెట్ ఇస్తారో వేచి చూడాలి.

Related News