//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హైప‌ర్ ఆది స్టార్ క‌మెడియ‌న్‌గా ఎద‌గ‌డం వెనుక ఉన్న ర‌హస్యం ఇదే..!

Category : movies

జ‌బ‌ర్ద‌స్త్‌లో ప్ర‌తీ శుక్ర‌వారం హైప‌ర్ ఆది వేసే పంచ్‌ల‌కు న‌వ్వ‌ని వారు అంటూ ఉండ‌రు. త‌న పంచ్‌ల‌తో ఇప్పుడు జ‌బ‌ర్ద‌స్త్‌లోనే టాప్‌మోస్ట్ క‌మెడియ‌న్‌గా పేరు తెచ్చుకున్నాడు. యూట్యూబ్‌లో కూడా ఆది కామెడీ స్కిట్‌ల‌కు మిలియ‌న్ల కొద్దీ వ్యూస్ ఉంటాయి. ప‌లు సినిమాల్లో కూడా ఆది న‌టించి.. మెప్పించాడు. ఈ మ‌ధ్య కాలంలో వ‌చ్చిన వ‌రుణ్ తేజ్ హీరోగా తెర‌కెక్కిన సినిమాలోనూ ఆది ప్ర‌ముఖ పాత్ర పోషించి న‌వ్వుల్ని పండించాడు.

జ‌బ‌ర్ద‌స్త్ నుంచి సినిమాల వ‌ర‌కు సాగిన ఆది ప్ర‌యాణంలో ఎన్నో ఒడుదుడుకులు ఉన్నాయ‌నే చెప్పాలి. జ‌బర్ద‌స్త్‌లోకి వ‌చ్చేందుకు ఆది ఎన్నో అష్ట‌క‌ష్టాలు ప‌డ్డాడు. ఓ మారుమూల ప‌ల్లెటూరు నుంచి ఎన్నో ఒడుదుడుకుల‌తో హైద‌రాబాద్‌లో ఓ చిన్న ప‌నిచేసుకునేందుకు వ‌చ్చాడు హైప‌ర్ ఆది.

ఇప్పుడు పొందుతున్న ఈ విజ‌యాల అన్నిటి వెనుక క‌ళ్లు చెమ‌ర్చే ఓ క‌న్నీటి క‌థ ఉంది. హైప‌ర్ ఆది పుట్టింది, పెరిగింది అంతా క‌డా ప్ర‌కాశం జిల్లా చీమ‌కుర్తి మండ‌లంలో వారి త‌ల్లిదండ్రుల పేరు న‌ర్సింహం, శార‌ద‌. వీరిది రైతు కుటుంబం. ఎనిమిద‌వ త‌ర‌గ‌తి వ‌ర‌కు ప‌ల్లామ‌ల గ్రామంలోని ఒక పాఠ‌శాల‌లో చ‌దువుకున్నాడు. 9, 10వ త‌ర‌గ‌తి కూడా అక్క‌డే ఉండే మ‌రో పాఠ‌శాల‌లో చ‌దివాడు. ఇంట‌ర్ మేద‌ర‌మెట్ల‌లోని శ్రీ చైత‌న్య జూనియ‌ర్ క‌ళాశాల‌లో చ‌దువుకున్నాడు. బీటెక్ ప్ర‌కాశం ఇంజినీరింగ్ క‌ళాశాల‌లో పూర్తి చేశాడు.

ప్ర‌కాశం జిల్లాలో ఇంజినీరింగ్ పూర్తి కాగానే ఆది ఉద్యోగం కోసం హైద‌రాబాద్ వ‌చ్చాడు. ఫ్రెండ్స్‌తో రూములో ఉంటూనే ఉద్యోగ ప్ర‌య‌త్నాలు చేశాడు. ఆ స‌మ‌యంలోనూ అత్తారింటికి దారేది సినిమా చూసి ఆ సినిమా లాస్ట్ క్లైమాక్స్‌ను పేరిడీ చేసి ఒక పార్క్‌లో వీడియో తీసి యూట్యూమ్‌లో పోస్ట్ చేశాడు. దాన్ని చూసిన జ‌బ‌ర్ద‌స్త్ టీమ్‌లోని అధిరే అభి కామెంట్ చేసి నాకు కూడా స్కిట్‌లు రాయాల‌ని అడిగాడు. అలాగే, అభి కోరిక మేర‌కు ఆది చాలా స్కిట్ల‌నే రాశాడు.

జ‌బ‌ర్ద‌స్త్ డైరెక్ట‌ర్లు అయిన వారిద్ద‌రూ కూడా స్కిట్ల‌ను రాయ‌డ‌మే కాకుండా, స్కిట్ల‌లో న‌టించాల‌ని కూడా కోరార‌ట‌. ఇక వెంట‌నే అదిరే అభి టీమ్‌లోనే కంటెస్టెంట్‌గా చేరాడు అదిరే అభి. త‌న యాక్టింగ్ కూడా క్లిక్ అవ‌డంతో టీమ్‌లీడ‌ర్‌గా అవ‌కాశం వ‌చ్చింది. ఇక ఆది త‌న ప‌వ‌ర్‌ఫుల్ స్కిట్స్‌తో, పంచ్‌ల‌తో హైప‌ర్ ఆది అనే ఒక ట్యాగ్‌లైన్‌ను తెచ్చుకుని టాప్‌మోస్ట్ క‌మెడియ‌న్‌గా జ‌బ‌ర్ద‌స్త్ టీమ్‌లో పేరు తెచ్చుకున్నాడు.

ప్ర‌స్తుతం స్ర్కిప్ట్ రైట‌ర్‌గా, క‌మెడియ‌న్‌గా ఆది దూసుకుపోతున్నాడు. త‌న‌కు సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి స్పూర్తి అని, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆరాధ్య దైవ‌మ‌ని చెబుతుంటాడు. అందుకే, వారిని ఎవ్వ‌రు తిట్టినా వెంట‌నే క‌య్యానికి కాలు దువ్వుతాడు హైప‌ర్ ఆది.

మొన్నీమ‌ధ్య‌నే క‌త్తి మ‌హేష్, హైప‌ర్ ఆది మీడియా వేదిక‌గా ఫైట్ చేసుకున్నారు. ఇలా ఒక మారుమూల ప్ర‌దేశం నుంచి క‌మెడియ‌న్‌గా అంచెలంచెలుగా ఎదిగాడు మ‌న హైప‌ర్ ఆది. క‌ష్ట‌ప‌డితే ఏదైనా సాధించ‌వ‌చ్చు అన్న‌ది త‌న న‌మ్మ‌క‌మ‌ని హైప‌ర్ చాలా ఇంట‌ర్వ్యూలో చెప్ప‌డం గ‌మ‌నార్హం.