ఈ నెల రెండో వారంలో బ్యాంకులకు వరుసగా సెలవులు రానున్నాయి. ఆరు రోజుల్లో బ్యాంకులు కేవలం మూడు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. కాగా ఆగస్టు 10న రెండో శనివారం, 11న ఆదివారం, 12న బక్రీదు రావటంతో వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. అంతేకాకుండా ఆ తర్వాత రెండు రోజుల విరామం అనంతరం ఆగస్టు 15న స్వాతంత్య్రదినోత్సవం కావడంలో మళ్ళి బ్యాంక్ కు సెలవు ఉంది.
అయితే ఇప్పుడు ఆయా సెలవు దినాల్లో నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి ఆన్లైన్ చెల్లింపులు కూడా పనిచేయక పోవచ్చు. ఇదిలాఉండగా అటు బ్యాంకులతో పాటు ఇటు ఏటీఎంలలో కూడా నగదు లేక మూతపడే అవకాశం లేకపోలేదని ఓ బ్యాంకు అధికారి వెల్లడించారు. ఇటు వంటి పరిస్థితులలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా బ్యాంకర్లు ఎలాంటి ఏర్పాట్లు ఏ మేరకు చేపడతారనే అంశంపై ఇంకా వివరణ లేదు.