//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నేటి ఐపీఎల్ హీరో సురేష్ రైనా

Category : sports

గుజరాత్ లయన్స్ మరియు కోల్ కత్తా నైట్ రైడర్స్ మధ్య శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో లయన్స్ పంజా విసిరింది. మొదట బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ ఓపెనర్ నరైన్ (42), మిడిలాడర్ రాబిన్ ఉతప్ప (72) పరుగులతో మెరవటంతో నిర్ణిత 20 ఓవర్లలో 187 పరుగులు చేసింది. పటిష్టమైన బౌలింగ్, సొంతగడ్డ పై ఆడటంతో విజయం పై ధీమాగా ఉన్న నైట్ రైడర్స్ కు దిమ్మదిరిగే షాక్ తగిలింది. ఓపెనర్లు ఆరోన్ పించ్ (31), మెక్ కలమ్ (33) ఇచ్చిన ఆరంభాన్ని ఉపయోగించుకుంటూ కెప్టెన్ రైనా (84) పరుగులతో ప్రత్యర్థి పై విజయకేతం ఎగురవేశాడు. ప్రత్యర్థి బౌలింగ్ పై విరుచుకుపడి విజయంలో కీ రోల్ పోషించి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గా నిలిచిన సురేష్ రైనా ఈ నాటి ఐపీఎల్ హీరో.