Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హైదరాబాద్ లో ఈరోజు రెండో జాతీయ పవర్ సమ్మిట్‌..!

Category : national

తెలంగాణ రాష్ట్ర ఎనర్జీ శాఖ ఎలెట్స్ టెక్నో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కలిసి రెండో జాతీయ పవర్ సమ్మిట్‌ను నగరంలో ఈ రోజు నిర్వహిస్తున్నారు.సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది.అలాగే దానితోపాటుగా 24 గంటల నిరంతర విద్యుత్ ను అన్నివర్గాలకు సరఫరా చేస్తోంది.

23 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఉచితంగా నిరంతర విద్యుత్‌ను అందిస్తోంది.ఈ సమ్మిట్ ఆలోచనల మార్పులు,నెట్‌వర్కింగ్,ఎక్స్‌ప్లోరింగ్ యొక్క కొత్త అవకాశాలను వెతుక్కునేందుకు ఉపయోగపడనుంది.ఈ సమ్మిట్‌లో "టీఎస్ రెడ్‌కో" చైర్మన్ ఎన్.జానయ్య,ఎనర్జీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి "అజయ్ మిశ్రా" పాల్గొనున్నారు.

Related News