//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Category : national

హరియాణాలోని యమునానగర్‌లో ఘోరం జరిగింది.

 స్వామి వివేకానంద స్కూల్‌లో 12వ తరగతి చదువుతున్న విద్యార్థి (18) నేరుగా ప్రిన్సిపాల్ రితు చబ్రా (47) గదిలోకి ప్రవేశించి వెంట తెచ్చుకున్న తండ్రి లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో మూడుసార్లు కాల్పులు జరిపాడు.

తీవ్ర గాయాలపాలైన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. చదువులో వెనకబడడం, ఇతర విద్యార్థులు, టీచర్లతో గొడవ పడుతున్న విద్యార్థిని ప్రిన్సిపాల్ పలుమార్లు మందలించారు. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న విద్యార్థి చంపేయాలని నిర్ణయించుకుని ఇంటి నుంచి తండ్రి తుపాకిని తీసుకొచ్చి కాల్పులు జరిపాడు.

కాల్పులు జరిపిన అనంతరం స్కూలు నుంచి పారిపోయేందుకు విద్యార్థి ప్రయత్నించగా పేరెంట్-టీచర్ మీటింగ్ కోసం వచ్చి క్యాంపస్‌లో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు అతడిని పట్టుకున్నారు.   విద్యార్థిపై హత్యకేసు నమోదు చేసిన పోలీసులు బాలుడి తండ్రిని అరెస్ట్ చేశారు.

ప్రిన్సిపాల్‌ను పది అడుగుల దూరం నుంచి కాల్చినట్టు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్కూలు యాజమాన్యం నిర్వహిస్తున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించగా, రక్తం అధికంగా పోవడం వల్ల మరణించినట్టు పోలీసులు తెలిపారు.