చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్ ఈ పేరు వినగానే మెగాస్టార్ చిరంజీవి కూడా విద్యా రంగం లోకి వస్తున్నారని మనం అనుకుంటాం కానీఅలా అనుకున్న అభిమానులందరికీ షాకే తగిలింది.శ్రీకాకుళం లో ఏర్పాటు చేసిన చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్ కి మెగా ఫ్యామిలీ కి ఎటువంటి సంబంధం లేదని సీఈవో శ్రీనివాసరావు తెలియజేశారు.ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్ కి చిరంజీవికి నాగబాబుకి గాని ఎలాంటి సంబంధం లేదని మెగాస్టార్ చిరంజీవి అభిమానులమైన తాము సేవా దృక్పధంతో స్కూల్ పేరిట స్థాపన చేశామని మధ్యతరగతి ప్రజలకు తక్కువ ఫీజులతో విద్యను చెప్పాలని దృడ సంకల్పంతో ఈ సంస్థని ఏర్పాటు చేశామని తెలిపారు.మెగా ఫ్యామిలీ పై మాకు ఉన్న అభిమానంతోనే చిరంజీవిని వ్యవస్థపాకుడిగా రామ్ చరణ్ గౌరవ అధ్యక్షుడిగా నాగబాబు గౌరవ ఛైర్మన్ గా నిర్మించుకున్నామని పేదలకు ఉన్నత విద్యను అందుబాటులోకి తేవడం కోసం మా ఈ ప్రయత్నం అని చిరంజీవి అభిమానులు అందరూ సహకరిస్తారని ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేశారు..