//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తరగతి గదిలోనే విద్యార్థిని మెడలో తాళి కట్టిన విద్యార్థి !

Category : editorial

తరగతి గదిలోనే ఓ విద్యార్థి, మరో విద్యార్థిని మెడలో తాళికట్టడం సంచలనంగా మారింది.

ఈ తరం పిల్లలు చిన్న వయస్సులోనే ప్రేమ దోమ అంటూ తిరుగుతున్నారు.. చదువుకోవాల్సిన వయస్సులో చెట్టపట్టాలు వేసుకొని పార్కుల చుట్టు తిరుగుతున్నారు.. సినిమాలు, బయట జరుగుతున్న సంఘటనలు చూసి పిల్లలు కూడా వాటిని అనుసరిస్తున్నారు.

ఇలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. తరగతి గదిలోనే ఓ విద్యార్థి, మరో విద్యార్థిని మెడలో తాళికట్టడం సంచలనంగా మారింది. ఇప్పుడీ వీడియో వైరల్ అయింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియోలో ఉన్న మాటలను బట్టి ఈ ఘటన తమిళనాడులో జరిగినట్టు తెలుస్తోంది. బాలిక మెడలో బాలుడు తాళి కడుతున్నప్పుడు తోటి విద్యార్థులు సహా బాలుడి తల్లి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వీడియోను ఆమే షూట్ చేసినట్టు అనుమానిస్తున్నారు.

బహుశా ఆమె టీచరై ఉండవచ్చని అంటున్నారు. వీడియో వైరల్ కావడంతో స్పందించిన బాలల హక్కుల సంరక్షణ సంస్థల ప్రతినిధులు, పోలీసులు ఈ జంట కోసం గాలిస్తున్నారు. ఈ వీడియో మొత్తం 29 సెకన్లు ఉంది. చేతిలో తాళి పట్టుకుని నిల్చున్న బాలుడు ‘అమ్మా..’ అంటూ ఆమె ఆదేశం కోసం చూడడం స్పష్టంగా కనిపించింది. ఆ వెంటనే ‘తాళి కట్టరా..’ అంటూ మహిళ తమిళంలో చెప్పడం వినిపించింది.

తల్లి ఆదేశంతో యూనిఫాంలో ఉన్న బాలిక మెడలో బాలుడు తాళికట్టాడు. ఆ సమయంలో తరగతి గదిలో మరికొంత మంది విద్యార్థులు ఉన్నట్టు వీడియోలో కనిపిస్తోంది. అంటే క్లాసు జరుగుతుండగానే ఈ తంతు జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న విషయం మాత్రం తెలియరాలేదు.