//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ట్రాప్‌ చేద్దామని ప్లాన్‌ వేస్తే బెడిసికొట్టింది

Category : national

ఒకరు కష్టపడి ఒక వస్తువుని తయారు చేస్తే.. దాన్ని కాపీ కొట్టి నకిలీలు తయారు చేసేవాళ్లు చాలామంది ఉంటారు. అందుకే ఉత్పత్తిదారులు కాపీరైట్స్‌ తీసుకొని జాగ్రత్త పడుతుంటారు. అయినా.. మోసగాళ్లు చాలా చాకచక్యంగా నకిలీలు తయారు చేస్తుంటారు. 1930ల్లోనూ అలాంటి సమస్యలు ఉండేవి. దీంతో అప్పట్లో ఓ సంస్థ తమ గీసిన రోడ్‌మ్యాప్‌ను మరొకరు కాపీ కొడితే ట్రాప్‌ చేసి పట్టుకోవడానికి లేని ఓ ప్రాంతాన్ని మ్యాప్‌లో సృష్టించింది. కానీ ఆ ప్రాంతం నిజంగానే ఏర్పడి వారి పథకాన్ని బెడిసికొట్టేలా చేసింది.

1930లో జనరల్‌ డ్రాఫ్టింగ్‌ సంస్థ వ్యవస్థాపకుడు ఒట్టో జీ. లిండర్‌బర్గ్‌.. అతని సహాయకుడు ఎర్నెస్ట్‌ అపర్స్‌ కలిసి న్యూయార్క్‌ రోడ్‌మ్యాప్‌ తయారు చేశారు. అయితే.. దీన్ని ఇతరులు కాపీ కొట్టకుండా ఉండాలని.. కొట్టినా అడ్డంగా దొరికిపోయేలా చేయాలని భావించి వారి పేర్లతో మ్యాప్‌లో ‘అగ్లొ’ పేరుతో ఓ వీధిని సృష్టించారు. ఆ మ్యాప్‌ను ఎస్సో అనే ప్రచురణ సంస్థ ముద్రించేది. అలా కొన్నేళ్లు గడిచాయి.

1950లో మ్యాప్‌లో ఉన్న ‘అగ్లొ’ ప్రాంతంలో ఓ జనరల్‌ స్టోర్‌ను నిర్మించారు. మ్యాప్‌లో ఉన్న ఆ పేరుతోనే దాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రాండ్‌ మెక్‌నల్లీ అనే పబ్లిషింగ్‌ సంస్థ అధికారుల అనుమతి తీసుకొని నిజంగానే అక్కడ ‘అగ్లొ’ ప్రాంతం ఉన్నట్లు నిర్ధారించుకొని వారి మ్యాప్‌లో ‘అగ్లొ’ పేరును నమోదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఎస్సో సంస్థ ‘అంగ్లొ’ కేవలం నకిలీలు తయారు చేసే వారిని పట్టుకోవడానికేనని వివరిస్తూ.. రాండ్‌ మెక్‌నల్లీపై కాపీరైట్‌ కేసులో దావా వేసింది. కానీ.. అక్కడ నిజంగానే ‘అంగ్లొ’ పేరుతో జనరల్‌ స్టోర్‌ ఉండటం చూసి ఖంగుతింది. ట్రాప్‌ చేద్దామని వేసిన పథకం నిజమై బెడిసి కొట్టింది. చట్టపరంగా చేసేదేమీ లేక కేసును కొట్టేశారు.ఆ ప్రాంతం పేరు 1990 వరకు మ్యాప్‌లో ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని తొలగించారు. అయితే యూఎస్‌ జియాలాజికల్‌ సర్వే మాత్రం తమ జాబితాల్లో ‘అగ్లొ(అనధికారికంగా)’ అని నమోదు చేసుకుంది. గూగుల్‌ మ్యాప్స్‌లో ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని గుర్తించొచ్చు.