//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య జరిగే సీన్ ఇదే..

Category : movies

విశ్వ విఖ్యాత నటసార్వభౌమ, టీడీపీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘యన్‌టిఆర్’ బయోపిక్‌'. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారు. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబు, సుమంత్, రానా, విద్య బాలన్, రకుల్ ప్రీత్ సింగ్ లు నటిస్తున్నారు. Scene between ANR and NTR in NTR biopic

ఈ రోజు అక్కినేని నాగేశ్వరరావు 94వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ బయోపిక్ లో అయన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు. ఈ సినిమాలో ఏఎన్నార్ పాత్ర చేస్తున్నాడు అయన మనమడు సుమంత్. పుట్టినరోజు శుభాకాంక్షలు తాత, ఇదే నా ఫస్ట్ లుక్ అంటూ తన ట్విట్టర్ లో పిక్ పోస్ట్ చేసాడు సుమంత్. ఈ పిక్ చుసిన ప్రేక్షకులు నిజంగా ఏఎన్నార్ చూసినట్టే ఉంది అంటున్నారు.Scene between ANR and NTR in NTR biopic

ఇక విషయానికి వస్తే ఈ సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య జరిగే మొదటి సీన్ ఇదే అంటూ ఓ వార్త సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినా తరువాత ఏఎన్నార్ వచ్చి ఎన్టీఆర్ ని కౌగలించుకొని నీలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి కావాలి అనే సీన్ తో ఏఎన్నార్ ఇంట్రడక్షన్ మొదలవుతుందని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ మరియు ఏఎన్నార్ మధ్య సీన్స్ చాల బాగా వచ్చాయని ఫిలింనగర్ టాక్. సంక్రాతికి విడుదల అవుతున్న ఈ చిత్రం ఇప్పటికే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది.Scene between ANR and NTR in NTR biopic