సెబీ వ్యవహారంలో సహారా గ్రూప్ అధిపతి సుబ్రతారాయ్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు. జూన్ 15వ తేదీ నాటికి షూరిటీ కింద రూ. 2,500 కోట్లు చెల్లించాలని లేకపోతే, మళ్లీ తీహార్ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది. గడువులోగా చెల్లింపులు జరగాలని చెక్ బౌన్స్ అయితే కోర్టు నుంచి నేరుగా తీహార్ జైలుకు పంపుతామని వార్నింగ్ ఇచ్చింది. చెల్లించడానికి డబ్బు లేకపోతే అంబీ వ్యాలీని వేలం వేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. 2014లో అరెస్టైన సుబ్రతా రాయ్ గత ఏడాది బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే.