//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వ్యాపారంలోనే కాదు ఎగవేతదారుల్లో కూడా ఎస్‌బిఐ ఫస్ట్

Category : business

ఐదు బ్యాంక్ ల విలీనం తరువాత ప్రపంచంలోని అతిపెద్ద 50 బ్యాంక్ లలో ఒకటైన ప్రభుత్వరంగ బ్యాంకుల్లో అగ్రగామి అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ఆవిర్భవించింది. దానితో డిపాజిట్ లలో సహజంగానే అందరికన్నా చాల ముందంజలో ఉన్నది. కేవలం డిపాజిట్ లలోనే కాదు తీసుకున్న రుణాలను ఎగవేసే ఖాతాలు సహితం ఈ బ్యాంక్ కె అత్యధికంగా ఉన్నాయి.

ఉద్దేశపూర్వక ఎగవేతదారుల(డిఫాల్టర్లు)లో 27 శాతం ఈ బ్యాంక్ లోనే ఉన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ  ప్రకటించిన వివరాల ప్రకారం మార్చి 31 ముగింపు నాటికి 1,762 మంది డిఫాల్టర్లు రూ.25,104 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీంతో బ్యాంకు బ్యాలెన్స్ షీట్‌పై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతోంది. ఎస్‌బిఐ తర్వాత అత్యంతగా మొండి బకాయిలు ఉన్న ప్రభుత్వ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ( పిఎన్‌బి). ఈ బ్యాంక్‌కు 1,120 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారులు ఉండగా, వీరు దాదాపు రూ. రూ 12,278 కోట్లకు ఎగనామం పెట్టారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఎస్‌బిఐ, పిఎన్‌బి ఈ రెండు బ్యాంకుల మొత్తం మొండి బకాయిలే రూ.37,382 కోట్లు అంటే 40 శాతం ఉండడం గమనార్హం.

2016-17 ఆర్థిక సంవత్సరం ముగింపునాటికి ఎగవేతదారుల మొత్తం రుణాలు రూ. 92,376 కోట్లుగా ఉండగా, 201516 ఆర్థిక సంవత్సరం ముగింపునాటికి రూ.76,685 కోట్లతో పోలిస్తే 20.4 శాతం పెరిగాయి. అదే సమయంలో ఏడాది-లో ఉద్దేశపూర్వక ఎగవేతదారులు 8,167 నుంచి 8,915 మందితో 10 శాతం పెరిగారు. మొత్తం 8,915 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు గాను 1,914 మంది డిఫాల్టర్లపై మాత్రమే ఎఫ్‌ఐఆర్ లను  నమోదు చేశారు.

ఎఫ్‌ఐఆర్ నమోదైనవారి రుణాలు రూ. 32,484 కోట్లు ఉన్నాయి. 2016-17 లో ఎస్‌బిఐ, దీని ఐదు అనుబంధ బ్యాంకులు సహా 27 ప్రభుత్వరంగ బ్యాంకులు దాదాపు రూ.81,683 కోట్లు రుణాలను మాఫీ చేశాయి. గత ఐదేళ్లలో రుణాల మాఫీ ఇదే అత్యధికం. అదే సమయంలో 2015-16తో పోలిస్తే ఇది 41 శాతం అధికంగా ఉంది. 2017 మార్చి ముగింపునాటికి ప్రభుత్వరంగ బ్యాంకుల స్థూల ఎన్‌పిఎ(నిరర్థక ఆస్తులు) రూ.6.41 లక్షల కోట్లుగా ఉండగా, అంతకుముందు ఏడాదిలో ఇది రూ.5.02 లక్షల కోట్లుగా ఉంది.