//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సవ్యసాచి డే-1 కలెక్షన్స్ షాక్ లో సినీ విశ్లేషకులు

Category : movies

మాస్ లో ఫాలోయింగ్ కోసం, సరైన బ్లాక్ బస్టర్ కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాడు నవ యువ సామ్రాట్ నాగ చైతన్య. ఆ క్రమంలోనే తాజాగా వచ్చినా చిత్రం సవ్యసాచి. మైత్రి మూవీ మైకెర్స్ నిర్మించిన ఈ చిత్రం ని ప్రేమమ్ కాంబినేషన్ చందు మొండేటి తో చేసాడు చైతు.

నిన్న రిలీజ్ అయినా ఈ చిత్రం డే మొత్తం లో 55 - 60 ప్రసెంట్ ఆక్యుపెన్సీ సాధించింది. ఆన్లైన్ బుకింగ్ జోరుగా సాగినప్పటికీ ,అనుకున్న స్థాయి లో ఆఫ్ లైన్ టికెట్స్ సేల్ అవ్వలేదు. దింతో శైలజ రెడ్డి అల్లుడు కి వచిన్న ఓపెనింగ్ కూడా సవ్యసాచి కి రాలేదు.25 కోట్ల టార్గెట్ తో బరి లోకి దిగిన సవ్యసాచి మొదటిరోజు రెండు తెలుగు రాష్ట్రాలకు గాను 3.29 కోట్ల షేర్ వచ్చింది.

కర్ణాటక , ఓవర్సీస్ కలుపుకుని టోటల్ గా 8 కోట్ల గ్రస్స్ ను , 4.24 కోట్లు షేర్ మాత్రమే సాధించినది. కలెక్షన్స్ ఎక్ష్పెక్త్ చేసినంత ఆశాజనికం గా లేవు. బ్రహ్మాండమైన ఓపెనింగ్ సాధించిన శైలజారెడ్డి అల్లుడే 25 కోట్ల బ్రేక్ ఈవెన్ ని క్రాస్ చేయలేదు. మరి సవ్యసాచి ఏమైనా మేజిక్ చేసి బ్రేక్ ఈవెన్ చేస్తదేమో చూడాలి.