//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మ‌హాన‌టి చిత్రంలో.. సావిత్రిని ధారుణంగా మోసం చేసిన.. సత్యం ఎవరు..?

Category : movies

మహానటి బాక్సాఫీస్ వ‌ద్ద ఇంకా స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతూనే ఉంది. సావిత్రి జీవిత క‌థ కావ‌డంతో జ‌నాలు ఆ సినిమాను చూడ‌డానికి ఇప్పటికీ ఆశ‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు. అయితే ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ఈ చిత్రంలో సావిత్రిని ఘోరంగా మోసం చేసిన వారిలో స‌త్యం ఒక‌రు. ఈ సినిమాలో జ‌బ‌ర్ధ‌స్త్‌ మహేష్ ఆ పాత్రను పోషించాడు. అయితే నిజ జీవితంలో అసలు సత్యం ఉన్నడా.. అసలు ఉంటె ఇప్పుడే ఎక్కడ ఉన్నట్లు అన్న సందేహం అంద‌రిలోనూ కలగవచ్చు..

అయితే సినిమాలో చూపించిన సత్యం అనే వ్యక్తి సావిత్రి నిజజీవితంలో ఎవరు లేరట‌. సావిత్రిని ఈ తరహా లో మోసం చేసినవారు తన చుట్టూ చాల మంది ఉన్నారని చూపించడం కోసం ఈ పాత్రను ఉపయోగించారట నాగ్ అశ్విన్. ఇక ఈ సినిమాలో కార్ డ్రైవర్, మేకప్ చేసే ఆమె.. వీరికి సంభందించిన అంశాలను చిత్రంలో చూపించలేకపోయానని నాగ్ అశ్విన్ ఓ ఇంట‌ర్వ్యూలో అన్నారు. సావిత్రి జీవితాన్ని ఇంత బాగా చూపించాలంటే ఎన్ని ఎపిసోడ్స్ పడతాయో మరి. ఏది ఏమైనా నాగ్ అశ్విన్ మాత్రం తెలుగు ఇండస్ట్రీ లో బయోపిక్స్ తీసేవారికి ఆదర్శంగా నిలిచేటట్లు ఈ సినిమాను చిత్రీకరించారు. అశ్విన్ ను చూసి కొంతమంది డైరెక్టర్లు కొంతమంది హీరో, హీరోయిన్ ల బయోపిక్ చేయడానికి రీసెర్చ్ కుడా మొదలు పెట్టారని స‌మాచారం.