//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సావిత్ర‌మ్మ‌జీవితంలో.. తీపి గుర్తులు - చేదు జ్ఞాపకాలు.. క‌న్నీళ్ళు పెట్టుకున్న క‌మ‌ల్ హాస‌న్..!

Category : movies

తెలుగు వెండితెర పై సావిత్రి జీవిక‌థ ఆధారంగా తెర‌కెక్కిన మహానటి విడుద‌ల అయ్యి సంచ‌ల‌న విజ‌యం సాధించిన త‌ర్వాత‌.. సావిత్రమ్మ‌ పై చ‌ర్చ‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. తాజాగా జయప్రద, కమల్ మధ్య సాగిన ఇంటర్వ్యూ లో సావిత్రమ్మ అని సంభోదిస్తూ కమల్ చెప్పిన మాటలు ప్రేక్ష‌కుల‌కు కంటతడి పెట్టించేవిగా ఉండ‌గా ఆయ‌న కూడా ఉద్వేగానికి లోనై క‌న్నీళ్లు పెట్టుకున్నారు.

బాల‌నటుడిగా కమల్ హాసన్ మహానటి సావిత్రితో అనేక చిత్రాల్లో నటించారు. సావిత్రమ్మ శివాజీ గణేశన్ లాంటి గొప్ప నటుల్ని చూస్తూ పెరిగానని అన్నారు. నటనలో ఓనమాలు వారినుంచే నేర్చుకున్నట్లు కమల్ తెలిపారు. సావిత్రమ్మ కొడుకునే నేను సావిత్రమ్మకు తొలి బిడ్డ పుట్టక ముందు నుంచే నన్ను ఓ దత్త పుత్రుడిలా చూసేదని కమల్ హాసన్ అన్నారు. నటనలో ఆమె రాణి అని కమల్ అన్నారు. సావిత్రమ్మ నటన చూసి ఇప్పటికి ఆశ్చర్యపోతుంటానని అన్నారు. రాయల్ లైఫ్ ఒక స్టార్ గా ఈమె ఎవరికీ అందనంత ఎత్తు ఎదిగింది. నా జీవితంలో ఒడిదుడుకులు ఉన్నాయా అంటే లేవనే చెబుతాను. కానీ సావిత్రమ్మ ఎదుర్కొన్న ఒడిదుడుకులు కళ్లారా చూశానని కమల్ అన్నారు.

సావిత్రమ్మ కోసం కిళ్ళీ తీసుకురావడానికి మద్రాసు నగరంలో ఇంపాలా కార్లు వెల్లేవని కమల్ అన్నారు. అలాంటి సావిత్రమ్మని రోడ్డుపై టాక్సీ కోసం నిలబడి ఉండే స్థితిలో చూశానని కమల్ హాసన్ కంటతడి పెట్టుకున్నారు. చిన్న రూమ్‌లో చూసి సావిత్రమ్మని పెద్ద స్టార్ గా ప్యాలెస్ లాంటి భవనాల్లో చూశా. అమావాస్య చంద్రుడు చిత్రంతో తాను నిర్మాతగా మారిన తరువాత తొలి చెక్ ని సావిత్రమ్మకు ఇద్దామని బయలుదేరా. సావిత్రమ్మ ఉంటున్న పెద్ద ఇల్లు గుర్తుంది. కానీ నన్ను మరో చోటికి తీసుకుని వచ్చారు. ఇక్కడకు ఎందుకు తీసుకుని వచ్చారు అని చూస్తే అక్కడ చిన్న గదిలో సావిత్రమ్మ ఉంది. కంటనీరు ఆగలేదు ఆ స్థితిలో సావిత్రమ్మని చూసి నా కంట తడి ఆగలేదు అని కమల్ హాసన్ అన్నారు. అలాంటి స్థితిలో కూడా సావిత్రమ్మని హుందాగానే చూశానని కమల్ హాసన్ గుర్తు చేసుకున్నారు.