//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

విదేశీ కార్మికులపై నిబంధనలు పెంచే యత్నాలు

Category : national

విదేశీ ఉద్యోగుల విషయంలో సౌదీ అరేబియా కూడా అమెరికా బాటలో వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. విదేశీ కార్మికులపై నిబంధనలు కఠినతరం చేసి సౌదీ పౌరులకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సౌదీ ప్రజలకు నిరుద్యోగం తగ్గించేందుకు కృషి చేస్తున్నామని అక్కడి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. విదేశీ కార్మికుల విషయంలో నిబంధనలు మరింత పెంచాలని, ఎక్కువగా సౌదీ పౌరులకు ఉద్యోగాలు కల్పించాలని కంపెనీలపై ఒత్తిడి తీసుకురానున్నట్లు ప్రభుత్వానికి చెందిన అధికారులు వెల్లడించారు. ఈ కొత్త పాలసీ వల్ల సౌదీలో నిరుద్యోగం 2020 నాటికి 12.1 నుంచి 9 శాతానికి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో సౌదీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల లక్ష్యం కూడా నెరవేరుతుందని భావిస్తున్నారు.

తక్కువ వేతనంతో పనిచేసే విదేశీ కార్మికుల విషయంలో నిబంధనలు కఠినతరం చేస్తే కంపెనీలపై భారం పడనుంది. కొత్త నిబంధనల ప్రభావం సౌదీ అరేబియాలో తక్కువ వేతనాలకు, ప్రమాదకరమైన పనులు చేస్తున్న దాదాపు 12మిలియన్ల మంది విదేశీ కార్మికులపై పడనుంది. మూడింట రెండొంతుల మంది సౌదీ ప్రజలు అక్కడి పబ్లిక్‌ సెక్టార్‌లో పనిచేస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం 500 నుంచి 2,999 మంది ఉద్యోగులున్న కంపెనీలు టాప్‌ ‘ప్లాటినమ్‌’ కేటగిరీలో వంద శాతం సౌదీ పౌరులనే నియమించాల్సి ఉంటుంది. పది శాతం మాత్రమే ఉద్యోగాలిస్తే ఆ కంపెనీలను ‘లోవర్‌ గ్రీన్‌’ కేటగిరీగా రేటింగ్‌ ఇస్తారు. ప్రస్తుతం ఈ రేటింగ్‌ ప్లాటినమ్‌కు 16శాతం, లోవర్‌ గ్రీన్‌కు 6శాతంగా ఉంది.

సౌదీలో తక్కువ వేతనాలకు, నిర్మాణ రంగంలో, ఇతర చిన్న చిన్న పనుల్లో లక్షలాది మంది విదేశీ కార్మికులు పనిచేస్తున్నారు. భారతీయులు, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో సౌదీకి పనుల కోసం వెళ్తుంటారు. సౌదీ విదేశీ కార్మికుల విషయంలో కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే విదేశీ కార్మికులపై తీవ్ర ప్రభావం పడనుంది.