//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తమిళనాడు బ్రేకింగ్ : రెండో పెళ్ళికి సిద్దమయిన శశికళ

Category : national

ఎంపీ శశికళ మళ్లీ పెళ్లి పీటలు ఎక్కబోతోందట. అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప మరో వివాహం చేసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఆహ్వానపత్రిక కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నెల 26న ఆమె ఢిల్లీలోని ఓ పెళ్లి చేసుకుంటుందట.

ఆమె చేసుకోబోయే వ్యక్తి ఓరియంటల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ రామస్వామి అట. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయని తెలుస్తోంది. శశికళ పుష్పకు లింగేశ్వర తిలకన్‌ అనే వ్యక్తితో గతంలోనే వివాహం జరిగింది. వీరికి ఓ బాబు కూడా ఉన్నారు. కాని ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకుల కోసం కోర్టుకెక్కారు. ఈ కేసును విచారించిన కోర్టు... వీరికి విడాకులు కూడా మంజూరు చేసింది.

ఇప్పుడు ఆమె ఈమె రామస్వామిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. పెళ్లికి 26న ఉదయం 9 గంటలకు ముహూర్తం కూడా కుదుర్చుకున్నారు. అదేరోజు ఉదయం 11 గంటలకు హోటల్‌లో గ్రాండ్‌ విందును కూడా ఏర్పాటు చేశారట. అప్పట్లో ఎంపీ చెంప పగులగొట్టి వార్తల్లో నిలిచిన పుష్ప... ఇప్పుడు మళ్లీ రెండో పెళ్లితో హాట్‌టాపిక్ అయ్యారు.