//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎగవేసిన పన్ను ఎంతో తెలుసా ?

Category : national

తమిళనాడు ఇన్ కం టాక్స్ అధికారులు చేపట్టిన ‘ఆపరేషన్‌ శశికళ’ సూపర్ హిట్ అయ్యింది

దివంగత మాజీముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలిగా దేశం మొత్తానికి సుపరిచితురాలైన శశికళ అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పన్నుఎగవేత ఆరోపణలతో శశికళ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువర్గానికి సంబంధించిన 147 ప్రాంతాల్లో 1800 మంది ఐటీ సిబ్బంది ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా శశికళ సంబంధీకులు పది బోగస్ కంపెనీల పేరిట 1000 కోట్ల రూపాయల పన్నులు చెల్లించకుండా అవకతవకలకు పాల్పడ్డారని ఐటీశాఖ నిర్ధారించింది.

బినామీ పేర్లతో 10 బోగస్‌ సంస్థలను ప్రారంభించిన శశికళ కుటుంబీకులు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడ్డారని ఐటీ వర్గాలు ప్రకటించాయి. పెద్ద నోట్ల రద్దు సమయంలో ఈ బోగస్‌ కంపెనీలు, సొంత వ్యాపారాలు, పార్టీ సంస్థలు, కార్యాలయాల ద్వారా పెద్దఎత్తున నగదుమార్పిడీకి పాల్పడ్డారని ఐటీ అధికారులు తెలిపారు. ఈ అవకతవకల్లో భాగమై, శశికళ డైరెక్టర్‌ గా ఉన్న ఫెన్సీ స్టీల్‌, రెయిన్‌ బో ఎయిర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, శుక్రా క్లబ్‌, ఇండో -దోహ కెమికల్స్‌ అనే నాలుగు సంస్థలు గత నెల మూసేయడం విశేషం.

ఈ ఇండో-దోహా కెమికల్స్ సంస్థలో ఇళవరసి, ఆమె బంధువు కులోత్తుంగన్‌ లు డైరెక్టర్లు. చెన్నైలోని నీలాంగరైలోని శశికళ బంధువు భాస్కరన్‌ ఇంట్లో లెక్క చూపని 7 కేజీల బంగారాన్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మన్నార్‌ గుడిలో శశికళ సోదరుడు దివాకరన్‌ నిర్వహిస్తున్న సెంగమళతాయార్‌ మహిళా కళాశాల విడిది గృహంలో 25 లక్షల రూపాయల నగదు, 6 రోలెక్స్‌ గడియారాలు, బంగారం, తదితరాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక శశికళకు చెందిన 315 బ్యాంకు ఖాతాలనూ స్తంభింపజేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి శశికళ కుటుంబ సభ్యుల పన్ను ఎగవేత 1000 కోట్లకి చేరుకుంది.