//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

శశి కళ ఇంట తీవ్ర విషాదం

Category : national

దివంగత ముఖ్యమంత్రి జయలలిత కు నెచ్చెలి గా పేరొంది, ఎల్లప్పుడూ ఆమె వెంటనే ఉంటూ చిన్నమ్మ గా తమిళనాడు లో సూపరిచితమయిన శశి కళ ఇంట తీవ్ర విషాదం నెలకొని ఉంది.

అక్రమాస్తుల కేసులో శిక్ష పడి బెంగుళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశి కళ భర్త నటరాజన్ నిన్న రాత్రి ఒంటిగంటన్నర కి కన్ను మూశారు.

మృతి చెందిన ఆయన పార్థివ దేహాన్ని చెన్నై బీసెంట్‌ నగర్‌లోని వారి నివాసానికి తరలించారు. అయితే జైలులో ఉన్న శశికళకు భర్త మరణం దృష్ట్యా పెరోల్‌ మంజూరు కానుంది. అయితే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తను చూసేందుకు శశికళ సోమవారం(మార్చి-19) రోజునే పెరోల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈలోపే వారి ఇంత విషాదం చోటు చేసుకుంది.

ఈరోజు ఉదయం 11 గంటల వరకు భౌతికాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. గతంలో నటరాజన్‌ ప్రజా సంబంధాల అధికారిగా పనిచేశారు.

హిందీ వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. జయలలితకు కొన్నాళ్ల పాటు రాజకీయ సలహాదారుగానూ వ్యవహరించారు. 1975లో నటరాజన్‌ శశికళను వివాహం చేసుకున్నారు. వీరి వివాహాన్ని కరుణానిధి జరిపించి నట్టుగా చెబుతారు.