//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మానుషి పై చిల్లర వ్యాఖ్యలు చేసిన శసి ధరూర్

Category : national

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి శశిథరూర్ వివాదంలో చిక్కుకున్నారు.

17 ఏళ్ల తర్వాత భారత్‌కు ప్రపంచ సుందరి కిరీటం అందించి, దేశపతాకాన్ని రెపరెపలాడించిన మానుషి చిల్లార్‌పై కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దును మానుషితో ముడిపెట్టి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్‌ తో పాటు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు సమన్లు జారీ చేసేందుకు కమిషన్ సిద్ధమైంది. ఇంతకీ శశిథరూర్ ఏమన్నారంటే..

పెద్ద నోట్లను రద్దుచేసి బీజేపీ ప్రభుత్వం ఎంత పెద్ద తప్పు చేసిందో ఇప్పటికైనా గుర్తించితే మంచిది... మన ‘చిల్లర’కు ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు ఉందో ‘చిల్లర్’ ప్రపంచ సుందరిగా ఎన్నిక కావడంతోనే అది రుజువైందని మానుషిని చిల్లరగా పోల్చుతూ ట్వీట్ చేశారు.

దేశ కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపజేసిన మానుషి చిల్లార్‌ను చిల్లర వ్యక్తిగా పోల్చిన శశిథరూర్‌పై జనం మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలతో తాను చిల్లర వ్యక్తి అని మరోసారి నిరూపించుకున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. థరూర్ వ్యాఖ్యలు బోడిగుండుకు మోకాలుకు ముడిపెట్టినట్టు ఉన్నాయని కొందరు విమర్శిస్తున్నారు. మానుషి జాట్ కులానికి చెందిన వ్యక్తి కావడంతో శశిథరూర్ మొత్తం జాట్లనే అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.