Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఉత్తమ్ ను ఓడిస్తానని సర్వే శపథం ... ఎందుకంటే

Category : state politics

కాంగ్రెస్ పార్టీ నాయకులను ఓడించటానికి బయటనుంచి వేరే పార్టీ నేతలు రానవసరం లేదు. సొంత పార్టీ నేతలే ఆ పనిని చేసేస్తారు. తెలంగాణలో జరిగిన ముంద‌స్తు ఎన్నిక‌ల్లో తెలంగాణ కాంగ్రెస్ తెరాస చేతిలో చిత్తుగా ఓడిపోయిన విష‌యం తెలిసిందే. ఈ ఓట‌మికి బాధ్య‌త‌ను వ‌హిస్తూ టీపీసీసీ ప‌ద‌వికి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయాలంటూ స‌ర్వే స‌త్య‌నారాయ‌ణ అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించారు. ఉత్త‌మ్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ఆయ‌న‌ను ఏఐసీసీ పెద్ద‌లు సంజాయిషీ కూడా కోరిన విష‌యం తెలిసిందే. ఆ వివాదం ఇంకా తెర‌మ‌రుగుకాక‌ముందే స‌ర్వే మ‌రోసారి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి.

ఏప్రిల్‌లో లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి ఎంపీగా న‌ల్ల‌గొండ నుంచి పోటీకి దిగుతున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హుజూర్‌న‌గ‌ర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయ‌న న‌ల్ల‌గొండ నుంచి ఎంపీగా పోటీ చేయ‌డానికి కాంగ్రెస్ పార్టీ త‌రుపున బ‌ల‌మైన‌ అభ్య‌ర్థులు లేక‌పోవ‌డంతో అధిష్టానం పిలుపు మేర‌కు ఆయ‌నే ఎంపీగా పోటీకి దిగుతున్నారు. ఇదే స‌ర్వే స‌త్య‌నారాయ‌ణ‌కు మండేలా చేసింద‌ట‌. పార్టీని భ్ర‌ష్టుప‌ట్టించిన ఉత్త‌మ్ ఎంపీగా గెలిస్తే కేంద్రంలో మంత్రి కావాల‌ని క‌ల‌లు కంటాడని , ఆ క‌ల‌లు క‌ల్ల‌లు చేస్తాన‌ని శ‌ప‌థం చేస్తున్నారాయ‌న‌.

ఈ ఎన్నిక‌ల్లో ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడిస్తాన‌ని, ఈ విష‌యంలో నా వంతు బాధ్య‌తని నిర్వ‌హిస్తాన‌ని, ఉత్త‌మ్‌లాంటి నేత దేశానికి అవ‌స‌రం లేద‌ని మండిప‌డ్డారు స‌ర్వే. అత‌ని వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తాన‌ని, ఉత్త‌మ్‌కు పీసీసీ ప‌ద‌వి అప్ప‌గిస్తే టికెట్‌లు అమ్ముకున్నాడ‌ని నిప్పులు చెరిగారు. ఉత్త‌మ్‌కు, భ‌ట్టి విక్ర‌మార్క‌కు చీము నెత్తురు ఉంటే వెంట‌నే ఆ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. తెలంగాణలో ప్రస్తుతం సర్వే వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్.

Related News