//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇక చీరలు కనపడవు !

Category : national

కామన్వెల్త్‌, ఆసియా గేమ్స్‌, ఒలింపిక్స్‌ ఇలా ఏ అంతర్జాతీయ క్రీడా సంరభానికైనా భారత క్రీడాకారిణీలు చీర కట్టుతో జాతీయ పతాకాలను చేత పట్టుకుని ప్రారంభ వేడుకల రోజు సందడి చేసేవారన్న సంగతి క్రీడాంశాలను కాస్త దగ్గర నుండి చూసే వారికి తెలిసిన విషయమే.

అయితే ఇక నుంచి వారు చీరలకు బదులు కోట్లు, ప్యాంట్లు ధరించి కనిపిస్తారు. భారత ఒలింపిక్‌ సమాఖ్య తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ‘ఈ ఏడాది ఏప్రిల్‌ 4న ఆస్ట్రేలియాలోని గోల్డ్‌ కోస్ట్‌లో కామన్వెల్త్‌ గేమ్స్‌ ప్రారంభంకానున్నాయి.

ఈ మెగా టోర్నీ ప్రారంభ వేడుకల్లో భారత బృందంలోని మహిళా క్రీడాకారిణీలు ఎప్పటిలా చీరలు ధరించడంలేదు. వాటి స్థానంలో కోట్లు, ప్యాంట్లు ధరించనున్నారు’ అని భారత ఒలింపిక్‌ సమాఖ్య జనరల్‌ సెక్రటరీ రాజీవ్‌ మెహతా ప్రకటించారు.

‘అథ్లెట్లను సంప్రదించే ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రారంభ వేడుకలు సుమారు నాలుగు నుంచి ఐదు గంటలపాటు సాగుతాయి. దీంతో మహిళా అథ్లెట్లు కాస్త ఇబ్బంది పడుతున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాదు ఎక్కువ మంది అమ్మాయిలకు చీర కట్టుకోవడం రాదు. తోటి వారి సాయం తీసుకుంటున్నారు.

వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే కామన్వెల్త్‌ గేమ్స్‌లో మహిళా అథ్లెట్లు కోట్లు, ప్యాంటు ధరించేలా నిర్ణయం తీసుకున్నాం’ అని రాజీవ్‌ వివరించారు. భారతీయ సంస్కృతి అంటూ కొందరు వాదించే వారు ఉన్నా ఆట ఆడాల్సిన అథ్లెట్లు వారికి కావాల్సిన సౌకర్యం కోరుకోవడం తప్పేమీ కాదు కదా.