//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Category : national

ఒక్క రూపాయికి ఏం వస్తుంది? ఇప్పుడైతే కనీసం చాక్లెట్ కూడా రావట్లేదు, అయితే మీరు బీదర్ వెళ్లితే చీర మాత్రం కొనుక్కోవచ్చు అది కూడా కేవలం ఒక్క రూపాయికే. అవును నిజమే... బీదర్ వెళితే, ఒకే ఒక్క రూపాయికి చీర దొరకుతుంది. ఓ వ్యాపారి తనకు వెంకటేశ్వరస్వామి కలలో కనిపించి 5 లక్షల చీరలను ఒక్కొక్కటీ రూపాయికే అమ్మమని చెప్పాడని దీన్ని ప్రారంభించాడు.

బీదర్‌లోని సృష్టి దృష్టి వస్త్ర దుకాణం యజమాని చంద్రశేఖర్ జేడీఎస్ పార్టీ‌కి వీరాభిమాని. ఈ ఏడాది జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ విజయం సాధించి, తమ నేత కుమారస్వామి మరోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించాలన్నది ఆయన కోరిక. కొద్ది రోజుల క్రితం తిరుపతి వెంకన్న తనకు కలలో కనిపించి, కుమారస్వామి మళ్లీ సీఎం కావాలంటే, 5 లక్షల చీరలను పంచాలని చెప్పాడట.

దీంతో కేవలం ఒక్క రూపాయికే చీరను విక్రయించాలని నిర్ణయించానని, 15 రోజుల పాటు మాత్రమే ఈ స్కీమ్ అమలులో ఉంటుందని చంద్రశేఖర్ తెలిపాడు. ఈ వార్త విన్న మహిళలు ఆయన దుకాణం ముందు ఇప్పుడు బారులు తీరారు. చంద్రశేఖర్ గతంలోనూ ఒక్క రూపాయికి చీరలను విక్రయించాడు. నోట్ల రద్దు తర్వాత రెండు రోజుల పాటు ఒక్క రూపాయికి లక్ష చీరలను విక్రయించాడు.

అయితే కేవలం రూపాయి నోటు మాత్రమే చెల్లుబాటు అవుతుందని, నాణేలను తీసుకోబోమనే నిబంధన విధించాడు. ఈ స్కీమ్‌తో చంద్రశేఖర్ పేరు దేశవ్యాప్తంగా మారమోగిపోవడమే కాదు, ఆయన మరో దుకాణాన్ని ప్రారంభించాడు. గతంలో కంటే అతిపెద్ద దుకాణం, అధిక సంఖ్యలో పనివాళ్లను నియమించుకున్నాడు.