Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎపిలో టిడిపి బలంగా ఉందని చెప్పిన శరద్ పవార్

Category : national state politics

ప్రధాని నరేంద్ర మోడిని ఓడించడానికి విభేదాలన్నీ పక్కన పెట్టి ముందుకి నడవాలని మాజీ కేంద్ర మంత్రి ఎన్సిపి అధినేత శరద్ పవార్ విపక్షాలకు సూచించారు. భండారా-గోండియా లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో గెలిచిన ఎన్సీపీ అభ్యర్థి మధుకర్‌ కుకడేతో సమావేశం తర్వాత మాట్లాడిన ఆయన- వివిధ రాష్ట్రాల్లో నాన్‌-ఎన్డీయే పక్షాలు బలంగా ఉన్నాయని, ఇవన్నీ ఏకతాటిపై నిల్చి బీజేపీని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు.

‘‘తెలంగాణలో టీఆర్‌ఎస్‌, ఆంధ్రలో టీడీపీ, కర్ణాటకలో జేడీఎస్‌. మహారాష్ట్రలో ఎన్సీపీ, కేరళలో లెఫ్ట్‌, బెంగాల్లో తృణమూల్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్రల్లో కాంగ్రెస్‌ బలంగా ఉన్నాయి. ఇవన్నీ కలిసి రావాలి. అప్పుడే బీజేపీ-వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అదే విధంగా ఇందిరా గాంధి ఎమర్జెన్సి విధించిన నాటి పరిస్థితులను ప్రస్తావిస్తూ...

‘‘అప్పుడూ ఇంతే... అన్నింటినీ బుల్‌డోజ్‌ చేసేసేవారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ఫలితంగా ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఒక్కతాటిపై నిలిచాయి. విపక్ష ఐక్యత వల్ల నాడు ఇందిరాగాంధీ లాంటి నేత ఓడిపోయారు. ఇప్పుడు కూడా విపక్షాలు ఏకమవుతున్నాయి. ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల విజయమే అందుకు సంకేతం. భావసారూప్యం గల పార్టీలను ఏకం చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. విపక్ష ఐక్యత సాధ్యం చేసేందుకు అందరితో మాట్లాడతానన్నారు.