మార్కెట్లోకి మరో కొత్త మొబైల్ విడుదలైంది.ఇప్పటికే మొబైల్ మార్కెట్లో రకరకాల సంస్థలు తమ స్మార్ట్ ఫోన్స్ తో అలజడి రేపుతుంటే..తాజాగా జపాన్‌కు చెందిన శాన్సుయ్ సంస్థ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. హారిజాన్1 పేరిట ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.3999కే విడుదల చేసింది.
ప్రముఖ ఆన్లైన్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్‌లో ఈ ఫోన్స్ అందుబాటులోకి వచ్చాయి. అతి తక్కువ ధరలో లభించే ఈ మొబైల్లో 'వీవోఎల్టీ' సదుపాయం, డ్యూయల్ సిమ్ సదుపాయంతో పాటు.. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుందని సంస్థ తెలిపింది.హారిజాన్1 ఫీచర్లు చూస్తే 4.5 అంగులాల తాకే తెర,1 జీబీ ర్యామ్,8 జీబీ అంతర్గత మెమొరీ,5 మెగా పిక్సెల్ రేర్ కెమెరా,3.2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా,2000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఇలా వున్నాయి.